Corona : కరోనా నష్టాన్ని భరించాలని కోర్టుకెక్కిన జంటకు చుక్కెదురు.. అసలు ఏమైందంటే..

Corona :  కరోనా నష్టాన్ని భరించాలని కోర్టుకెక్కిన జంటకు చుక్కెదురు.. అసలు ఏమైందంటే..

ప్రతీకాత్మ కచిత్రం

Corona : కార్బీ కుసియంబా-రాబర్ట్ కుసింయంబా ఇద్దరూ భార్యాభర్తలు. రాబర్ట్ విక్టర్ వుడ్ వర్క్స్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా కాలంలో వర్కర్లను తమ సంస్థ ఒక చోట నుంచి మరో ప్రదేశానికి పదే పదే తీసుకెళ్లిందని..

  • Share this:
కరోనా సోకి ఇబ్బంది పడిన ఓ జంట తమకు వచ్చిన నష్టాన్ని పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం భరించాలని, సంస్థే బాధ్యత తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకుంది. అయితే కోర్టులో సమస్యకు పరిష్కారం దొరికిందా అంటే లేదనే చెప్పాలి. కరోనా కారణంగా తాము భారీగా నష్టపోయామని కార్బీ-రాబర్ట్ అనే దంపతులు వేసిన దావాను అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి మాక్సిన్ ఎం చెస్నీ తోసిపుచ్చారు. అయితే కేసును మరో సారి పునఃపరిశీలించి సవరణలు చేసి మరోసారి కేసు వేసే అవకాశాన్ని ఆ దంపతులకు ఇచ్చారు. ఈ వ్యాజ్యం కార్మికుల పరిహారాలకు చెందిన ప్రత్యేక నిబంధన కిందకు వస్తుందని ఆయన తీర్పు చెప్పారు. ఈ నిబంధన కింద కంపెనీ యాజమాన్యంపై వారు కేసు వేయలేరని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని మరో సారి పునఃపరిశీలించి సవరణలు చేసి కేసు వేయాలంటూ వారికి సూచించారు. ఈ తీర్పుతో ఆ దంపతులకు ఏం చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు.

వివరాల్లోకి వెళ్తే.. కార్బీ కుసియంబా-రాబర్ట్ కుసింయంబా ఇద్దరూ భార్యాభర్తలు. రాబర్ట్ విక్టర్ వుడ్ వర్క్స్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా కాలంలో వర్కర్లను తమ సంస్థ ఒక చోట నుంచి మరో ప్రదేశానికి పదే పదే తీసుకెళ్లిందని, స్థానిక ప్రభుత్వాలు విధించిన మార్గదర్శాకాలను పాటించలేదని అతడు ఆరోపించాడు. ఇలా శాన్ ఫాన్సిస్కోలో పలు ప్రదేశాలకు మార్చడం వల్ల ముందు తనకు కరోనా సోకిందని, అనంతరం తన భార్య కార్బీకి వచ్చిందని దావాలో పేర్కొన్నాడు. ఫలితంగా చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడమే కాకుండా ఆర్థికంగా ఎంతో నష్టపోయామని ఈ జంట ఫిర్యాదులో తెలిపింది.

కరోనా కాలంలో పదే పదే ఉన్న ప్రదేశాలు మార్చడం వల్ల చాలా మంది ప్రభావితులయ్యారని కుసియంబా దంపతులు కోర్టుకు విన్నవించారు. ఇందుకు కార్మికుల పరిహారాల నిబంధనల కింద ఈ కేసు వేయలేమని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చడంతో వారు నిరాశకు లోనయ్యారు. కరోనా కాలంలో అమెరికాలో చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాజా తీర్పుతో సంస్థ యాజమాన్యంపై ఏ వ్యక్తి కూడా కేసు వేయలేరని విక్టర్ వుడ్ వర్క్ కంపెనీ తరఫు న్యాయవాది విలియం బోగ్డాన్ ఈమెయిల్ ద్వారా చెప్పారు. కుసియంబా దంపతులు మరోసారి కేసు వేసినప్పటికీ ఇలాంటి ఫలితమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు