కామారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురు డెలివరీ కోసం వెళ్లిన తల్లీ కొడుకులను..

కరోనా రాకున్నా.. లక్షణాలు లేకున్నా.. తల్లి కొడుకును ఊళ్ళోకి రానివ్వకుండా గ్రామస్తులు స్కూల్ లో ఉంచారు.

news18-telugu
Updated: July 4, 2020, 6:27 PM IST
కామారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురు డెలివరీ కోసం వెళ్లిన తల్లీ కొడుకులను..
కామారెడ్డి
  • Share this:
కామారెడ్డి జిల్లాలో దారుణం చొటు చేసుకుంది. కరోనా రాకున్నా.. లక్షణాలు లేకున్నా.. తల్లి కొడుకును ఊళ్ళోకి రానివ్వకుండా గ్రామస్తులు స్కూల్ లో ఉంచారు. కూతురు డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్ళి వచ్చినందుకు తల్లి కొడుకులకు కూడా క‌రోనా వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి రానివ్వకపోవడంతో మూడు రోజుల పాటు రోడ్లపై బస్టాండ్ లో పడుకొని ఇబ్బందులు పడ్డారు. తీవ్ర మనో ఆవేదనకు గురైనట్లు బాధితులు తీసిన సెల్ఫీ వీడియోలు అందరిని కంట తడి పెట్టిస్తున్నాయి. కరోనా కంటే గ్రామస్తుల మానసిక వేధింపులతోనే చనిపోయాలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో సుధా వంట పని చేసుకుంటూ ఉంటుంది. సుధా కుమార్తె కు వివాహం చేసింది. ఉన్న ఒక్క కొడుకు రాకేష్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేస్తున్నాడు... లాక్ డౌన్ నేపథ్యంలో మార్చిలో సుధా కుమారుడు, కుమార్తె జంగంపల్లి కి వచ్చారు. కుమార్తె ఐదు నెలల గర్భవతి కావడంతో సుధా కామారెడ్డి లో పరీక్షలు చేయించింది. సుధా తన కుమార్తెను డెలివరీ కోసం జూన్ 26 తేదిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా దగ్గు, ఆయాసం ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ డెలివరీ చేసి పరీక్షలు చేయగా సుధా కుమార్తెకు, పుట్టిన శిశువు కరోనా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె వద్దకు వెళ్లి సుధా సేవలు చేసింది. జూన్ 29వ తేదీన జంగంపల్లికి వచ్చారు. అయితే తల్లీ కొడుకులను గ్రామస్తులు అడ్డుకొని ముందు కరోనా పరీక్షలు చేయించుకుని గ్రామానికి రావాలని సూచించారు. దీంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరోనా పరీక్షలు చేయాలని వైద్యులను ప్రాధేయపడ్డారు. అయితే ఏకాదశి ఉండడంతో ఆ రోజు పరీక్ష చేయలేదు. దీంతో తల్లి కొడుకు కామారెడ్డి బస్టాండ్ లో రెండురోజులు ఉన్నారు. గత రెండు రోజుల క్రితం వారి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్ కు పంపించారు. అనంతరం జంగంపల్లి కి చేరుకున్నారు. ఇంటి యజమానులు ఇంట్లో ఉండేదుకు అభ్యంతరం చెప్పారు. ఇంట్లో ఉండవద్దు అనడంతో అధికారులు గ్రామ శివారులో గల స్కూల్లో ఉంచారు. వీరికి సంబంధించిన రిపోర్టులు శనివారం వచ్చే అవకాశం ఉంది... ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి.

Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading