కొడుకుకు కరోనా వచ్చిందని.. ప్రకాశం బ్యారేజీ కాల్వలో దూకిన తండ్రి

కరోనా సోకిన తన కొడుకు ఇక బతకడేమోనని నాగేశ్వరరావు మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రకాశం బ్యారేజీ కాల్వలో దూకి ఆత్మాహత్యాయత్నం చేశాడు.

news18-telugu
Updated: July 31, 2020, 12:42 PM IST
కొడుకుకు కరోనా వచ్చిందని.. ప్రకాశం బ్యారేజీ కాల్వలో దూకిన తండ్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొడుకుకు కరోనా సోకిందన్న మనస్థాపంతో తండ్రి ఆత్మహత్యయత్నం చేశాడు. కాల్వలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావుకు కుమారుడు ఉన్నాడు. ఇటీవల అతడికి తీవ్ర జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా సోకిన తన కొడుకు ఇక బతకడేమోనని నాగేశ్వరరావు మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రకాశం బ్యారేజీ కాల్వలో దూకి ఆత్మాహత్యాయత్నం చేశాడు. అతడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడి... అనంతరం ఆస్పత్రికి తరలించారు.


కాగా, ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్‌ల సంఖ్యను పెంచడంతో పెద్ద మొత్తంలో వైరస్ బాధితులు బయటపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,30,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా జయించి వీరిలో 60,024 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1281 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 69,252 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,90,077 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading