కరోనా లక్షణాలున్న కూతురిపై తండ్రి అత్యాచారం.. నిద్ర మాత్రలు ఇచ్చి..

ఉదయం నిద్రలేచిన యువతి.. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ విషయాన్ని సవతి తల్లికి చెప్పినా పట్టించుకోలేదు.

news18-telugu
Updated: June 30, 2020, 3:15 PM IST
కరోనా లక్షణాలున్న కూతురిపై తండ్రి అత్యాచారం.. నిద్ర మాత్రలు ఇచ్చి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా మందు అంటూ నిద్రమాత్రలు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ ఘోరం జరిగింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. బెల్లందూరుకు చెందిన 41 ఏళ్ల రాకేష్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అతడికి దూరంగా ఉంటోంది. రాకేష్ రెండో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. మొదటి భార్య కూతురు (19) నెల రోజుల క్రితం తండ్రికి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. ఐతే మూడు రోజులుగా ఆమెలో కరోనా లక్షణాలు కనిపించాయి. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో తండ్రికి చెప్పింది.

ఐతే తండ్రి కరోనాను తగ్గించే టాబ్లెట్లు అంటూ కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమెపై అదే రాత్రి అత్యాచారం చేశాడు. ఉదయం నిద్రలేచిన యువతి.. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ విషయాన్ని సవతి తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. తిరిగి ఆమెపైనే నిందలు వేసింది. దాంతో ఆ యువతి తన ఫ్రెండ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
First published: June 30, 2020, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading