కర్నూలులో కరోనా ఎఫెక్ట్... ఎద్దుకు మాస్క్ కట్టిన రైతన్న

ఎద్దుకు ‘మాస్క్‌’ కట్టిన రైతు

కర్నూలు జిల్లాలో ఓ రైతు కరోనా నుంచి కాపాడుకోవడానికి తాను మాస్క్ కట్టుకోవడంతో పాటు ఎద్దుకు కూడా మాస్క్ కట్టాడు.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి గురించి తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ పశు సంపదను కూడా కాపాడుకోవడానికి ప్రజలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా హాట్ స్పాట్ లా మారిన కర్నూలు జిల్లాలో ఓ రైతు కరోనా నుంచి కాపాడుకోవడానికి తాను మాస్క్ కట్టుకోవడంతో పాటు ఎద్దుకు కూడా మాస్క్ కట్టాడు. ఎద్దుకు మాస్క్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోవద్దు. తనకు తోచినట్టు ఓ టవల్‌‌ను ఆ ఎద్దు ముక్కుకు చుట్టూ కట్టేశాడు. కర్నూలు నగరంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్డి కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ తాను మాస్క్ పెట్టుకుంటున్నాడు. తనతో పాటు ఎద్దుకు గుడ్డను మాస్క్‌లా కడుతున్నాడు. జంతువులకు కూడా కరోనా వైరస్ సోకుతోందని టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో తన ఎద్దును వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేశాడు. ‘ఎక్కడో పులికి కరోనా వచ్చిందని పేపర్లో వేశారు. మా పిల్లలు చెప్పారు. మనం కూడా కడదామని అంటే కట్టా. నేను కూడా ఎద్దుకు మాస్క్ కట్టా. దాన్ని కొడుకులా చూసుకుంటున్నా. ఇప్పుడు బంగారంలా ఉంది. అది నోరు లేని జీవి. పశువులు, భూమి బాగుంటే మనం కూడా బాగుంటాం.’ అని రైతు తెలిపాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: