Covid-19 deaths: ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకు పరిహారం అందజేస్తారా?.. కేంద్రం సమాధానమిదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో(Coronavirus) లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా కరోనాతో చాలా మందే మృతిచెందారు.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా కరోనాతో(Coronavirus) లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా కరోనాతో చాలా మందే మృతిచెందారు. కరోనాతో మృతిచెందినవారిలో ధనికులు, పేదలు కూడా ఉన్నారు. కరోనాతో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే వారికి పరిహారం అందజేయాలనే డిమాండ్ వినిపింది. దీంతో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం( compensation for Covid-19 deaths) చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తెలిపింది. ఈ పరిహారాన్ని రాష్ట్రాలు.. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్(State disaster response fund) నుంచి చెల్లించాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది.

    కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్ని ప్రాణాలు కోల్పోయిన వారిక కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారని, అవి పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో కరోనాతో మరణించినవారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

    Corona Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు ఊరట.. ఇలా అప్లై చేసుకుంటే రూ.50వేలు.. త్వరలోనే అమలు..

    ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగులకు..
    అయితే కరోనా సోకడంతో ఆందోళన చెందిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలు కూడా పరిహారం పొందేందుకు అర్హలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు((Supreme Court)) తెలిపింది. కోవిడ్ పాజటివ్ రిపోర్ట్ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు పరిహారం పొందడానికి అర్హులని చెప్పింది. దీంతో కరోనా పాజటివ్‌గా తేలడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా రూ. 50వేల పరిహారం అందనుంది.

    Head bath: రోజు తల స్నానం చేయడం మంచిదేనా?.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

    ఇక, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా (Justices MR Shah), జస్టిస్‌ ఏఎస్ బోపన్న(AS Bopanna)లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 13న కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి పరిహారం పొందడానికి అర్హులేనని గురువారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈమేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయవచ్చని తెలిపింది. ఈ విచారణ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని అభినందించిన జస్టిస్ ఎంఆర్ షా.. ’ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.. ఈ నిర్ణయం చాలా మంది కన్నీళ్లను తుడుస్తుంది’ అని వ్యాఖ్యానించారని NDTV పేర్కొంది.

    కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఎలా అందుతుందంటే..
    కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు 30 రోజుల్లోగా పరిహారం అందుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం బాధిత కుటుంబాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి.. ఈ కమిటీ చేసే సిఫార్సు మేరకు పరిహరం చెల్లించనున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: