విషాదం.. రెండు రోజులు ఇంటిలోనే కరోనా మృతదేహాం..

కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రాకపోవడంతో అతడికి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు స్థానిక హాస్పిటల్ డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆ మృతదేహాన్ని ఖననం చేసేందుకు వీలు కాలేదు.

news18-telugu
Updated: July 3, 2020, 10:01 AM IST
విషాదం.. రెండు రోజులు ఇంటిలోనే కరోనా మృతదేహాం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి చుట్టుపక్కలకు వెళ్లేందుకే ప్రజలు జంకుతున్నారు. కరోనా మృతదేహాలను గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడంతో శివార్లలోనే అంత్యక్రియలు చేసిన ఘటనలు ఉన్నాయి. తమకు ఎక్కడ సోకుతుందోనని కట్టుకున్న భర్తలు, కన్నతల్లిదండ్రుల మృతదేహాలను వదిలివెళ్లిన దృశ్యాలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి ఓ కుటుంబం రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంటిలోనే భద్రపర్చుకున్న విషాద ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. పూర్తి విరాల్లోకి వెళితే.. సెంట్రల్ కోల్‌కతాలోని రాజారామ్మోహన్‌రాయ్ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరంతో పాటు కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో కుటుంబ సభ్యులు ఓ వైద్యుడి(71) సలహాతో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించారు.

అనంతరం వృద్ధుడిని ఇంటికి తీసుకురాగా ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మరణించాడు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రాకపోవడంతో అతడికి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు స్థానిక హాస్పిటల్ డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆ మృతదేహాన్ని ఖననం చేసేందుకు వీలు కాలేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు ఇంటిలోనే మృతదేహాన్ని భద్రపరచాల్సి వచ్చింది. ఏలాగైనా సాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు వేడుకున్నా.. కోల్‌కతా అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
First published: July 3, 2020, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading