ఫేక్ న్యూస్ అడ్డాగా సోషల్ మీడియా.. తప్పుడు పోస్టులు పెడితే కేసులే..

Fake News : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా దొరికిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై తమ కొంటెతనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా ఫేక్ న్యూస్‌కు సోషల్ మీడియా అడ్డాగా మారింది.

news18-telugu
Updated: April 7, 2020, 7:37 AM IST
ఫేక్ న్యూస్ అడ్డాగా సోషల్ మీడియా.. తప్పుడు పోస్టులు పెడితే కేసులే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పౌరులు కొందరు ఆకతాయిల్లా వ్యవహరిస్తున్నారు. తప్పులు సమాచారాన్ని సృష్టించి దాన్ని వైరల్ చేస్తున్నారు. వైన్ షాప్స్ తెరుస్తారంటూ, లాక్‌డౌన్ ఎత్తేస్తారంటూ జోరుగా ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. కొందరు జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా దొరికిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై తమ కొంటెతనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా ఫేక్ న్యూస్‌కు సోషల్ మీడియా అడ్డాగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం కొండెక్కిందని.. ఇలా పలు రకాల తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

అయితే, అలాంటివారిపై కేసులు పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి factcheck పేరుతో వె‌బ్‌సైట్ తెరిచి, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేస్తోంది. ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వారిపై కేసులు పెడుతోంది. వైన్ షాప్స్ తెరుస్తున్నారని ఓ వ్యక్తి నకిలీ జీవో ప్రతిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతడ్ని బొక్కలోకి తోసింది. ఇప్పటికైనా ఏ సమాచారం తెలిసినా వెంటనే అది నిజమో కాదో తెలుసుకొని ఫార్వర్డ్ చేయడం, పోస్ట్ చేస్తే మనకూ మంచిది.
First published: April 7, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading