FACT CHECK SHOULD WOMEN NOT TAKE COVID19VACCINE 5 DAYS BEFORE AND AFTER THEIR MENSTRUAL CYCLE HERE IS TRUTH SK
Fact Check: పీరియడ్స్ సమయంలో కరోనా టీకా తీసుకోకూడదా? అమ్మాయిలూ మీ కోసమే.. ఇదీ నిజం
ప్రతీకాత్మక చిత్రం
పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియల్స్కు 5 రోజుల తర్వాత మహిళలు వ్యాక్సిన్ వేసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏ చెబుతోంది?
భారత్‌ను కరోనా కబళిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు వేయబోతున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని.. పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, పీరియల్స్కు 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వ్యాక్సిన్ వేసుకున్న తొలి రోజుల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుందని అందులో ఉంది. అందుకే పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని దాని సారంశం. వాట్సప్‌లో ఈ సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది అమ్మాయిలు దీన్ని వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. మరి ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏ చెబుతోంది?
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని.. ఇలాంటి పుకార్లని నమ్మవద్దని సూచించింది. 18 ఏళ్లు నిండిన మహిళలంతా ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది.
#Fake post circulating on social media claims that women should not take #COVID19Vaccine 5 days before and after their menstrual cycle.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటి వరకు 13 కోట్ల 83 లక్షల 79వేల 832 డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా ఇస్తామని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకోవదలచుకున్న వారు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని.. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపింది.
కాగా, భారత్‌లో నిన్న 3,46,786 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481కి చేరింది. నిన్న 2,624 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,89,544కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,19,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,38,67,997కి చేరింది. రికవరీ రేటు 83.9 నుంచి 83.5 శాతానికి పడిపోయింది. దేశంలో కొత్త కేసులు పెరుగుతూ ఉంటే రికవరీ రేటు రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం భారత్‌లో 25,52,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.