FACT CHECK RUMOURS ON INDIA WIDE LOCKDOWN FROM MAY 3RD HERE IS CENTRAL GOVERNMENT CLARITY SK
Lockdown: మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటుందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రతీకాత్మకచిత్రం
lockdown: మే 3 నుంచి 20 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారని కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వేలాది పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? కేంద్రం ఏం చెప్పింది?
రేపే మే 2. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం కేంద్రం కేబినెట్ సమావేశమై లాక్‌డౌన్‌పై ప్రకటన చేస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మే 3 నుంచి 20 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారని కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వేలాది పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. మిగత రాష్ట్రాల్లోనూ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మే, జూన్ నెలలో దేశ ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారని.. అందుకే ఉచిత రేషన్‌పై కేంద్రం ప్రకటన చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐతే ఈ ఊహాగానాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇందులో నిజం లేదని.. కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రమే అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించింది.
सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
కాగా, భారత్‌లో కొత్తగా 4,01,993 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కి చేరింది. కొత్తగా 3,523 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,99,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,56,84,406కి చేరింది. రికవరీ రేటు 81.8 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 32,68,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 19,45,299 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 28 కోట్ల 83లక్షల 37వేల 385 టెస్ట్‌లు చేశారు. నిన్న 27,44,485 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 15కోట్ల 49లక్షల 89వేల 635 డోసుల వ్యాక్సిన్ వేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.