లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లాక్డౌన్ కన్నా ముందే మార్చి 31 వరకు రైళ్లు నిలిపివేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అప్పటివరకు రైళ్లు నడవవని భారతీయ రైల్వే ప్రకటించింది. ఆ తర్వాత మే 3 వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ మరోసారి ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో మే 3 వరకు రైళ్లు నిలిపివేస్తున్నట్టు భారతీయ రైల్వే మరోసారి ప్రకటన విడుదల చేసింది. బుకింగ్స్ కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. రైళ్లు నిలిచిపోవడంతో భారతీయ రైల్వే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం రైల్వే ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. మరి ఈ ప్రచారం నిజమేనా? తెలుసుకుందాం.
రైళ్ల రద్దుతో సంబంధం లేకుండా రైల్వేలో పనిచేస్తున్న శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల వేతనం పూర్తిగా చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాలకు మార్చి నెల వేతనం పూర్తిగా చెల్లించామని, ఏప్రిల్ నెల వేతనం కూడా పూర్తిగా చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ మీడియాకు వెల్లడించారు. లోకో పైలట్స్, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగుల వేతనం లేదా అలవెన్సుల్లో ఎలాంటి కోత ఉండదన్నారు. కాబట్టి రైల్వే ఉద్యోగుల వేతనాల్లో కోత ఉంటుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. వేతనాల విషయంలో రైల్వే ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
LIC Policy Loan: ఎల్ఐసీ పాలసీ ఉందా? లోన్ తీసుకోవచ్చు ఇలా
Loan: రూపాయి వడ్డీకే లోన్... ఎవరు తీసుకోవచ్చంటే
Personal Loans: కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులుPublished by:Santhosh Kumar S
First published:April 24, 2020, 11:50 IST