కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ప్రజలకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు, ఉచిత సర్వీసుల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు అదనంగా డేటాను అందిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఉచిత సేవల్ని అందిస్తున్నాయి. అయితే వీటిపై అనేక తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజెస్, సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా ఇవే కనిపస్తున్నాయి. వాటిని ప్రజలు నమ్ముతున్నారు. నిజమని అనుకుంటున్నారు. అలాంటిదే ఈ మెసేజ్ కూడా. భారత ప్రభుత్వ తెలికాం శాఖ 2020 మే 3 వరకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుంది అన్న మెసేజ్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తోందన్నది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు... ఆ మెసేజ్‌లో ఓ లింక్ కూడా ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఉచితంగా ఇంటర్నెట్ పొందొచ్చని మెసేజ్‌లో వివరించడం విశేషం. కానీ ఇదంతా అబద్ధం.
दावा : भारतीय दूरसंचार विभाग ने सभी मोबाइल यूजर को 3 मई 2020 तक फ्री इंटरनेट देने का ऐलान किया है जिसे प्राप्त करने के लिए दिए गए लिंक पर क्लिक करना होगा
तथ्य :यह दावा बिलकुल झूठ है, व दिया गया लिंक फर्जी है|
లాక్డౌన్ కారణంగా మే 3 వరకు భారత టెలికాం శాఖ ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుందన్న మెసేజ్‌పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో-PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఆరా తీసింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పింది. ప్రజలు ఇలాంటి తప్పుడు మెసేజెస్‌ని నమ్మొద్దని హెచ్చరిస్తోంది. ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని, అందులో లింక్ కూడా తప్పని, రూమర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఈ మెసేజ్‌ను ఎవరో వాట్సప్‌లో క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేశారు. దీన్ని నిజం అనుకొని అందరూ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మెసేజ్ వైరల్‌గా మారింది.