FACT CHECK CORONAVIRUS CANNOT TRANSMITTED THROUGH MOSQUITO BITES
Fact Check: దోమ కాటుతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా?
ప్రతీకాత్మక చిత్రం
Fact Check on Coronavirus | కరోనా వైరస్ గురించి ప్రజల్లో పలు అపోహలు, అనుమానాలు ఉన్నాయి. దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో నిజమెంత?
Covid-19 Myths vs Facts: కరోనా వైరస్...ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న ప్రాణాంతక వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటి వరకు 125 దేశాలకు వ్యాపించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి పలు కథనాలు వెలువడుతున్నాయి. వీటిలో నిజాలకంటే...అసత్యాలే ఎక్కువగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి పలు రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి.
తాజాగా దోమల కాటుతో కరోనా వైరస్ సోకుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ కథనాలను వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దోమల కాటుతో కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టంచేస్తున్నారు. దోమకాటుతో ఈ వైరస్ వ్యాపించదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది. శ్వాసకోసకు సంబంధించిన వైరస్ ఇది. దగ్గులు, తుమ్మలు, లాలాజలం ద్వారా బాధిత వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది.