Moratorium: డిసెంబర్ వరకు మారటోరియం... పొడిగించే అవకాశం

Moratorium | ఇప్పటి వరకు 30 శాతం మంది రుణగ్రహీతలు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నట్టు బ్యాంకుల లెక్కలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: July 8, 2020, 9:59 AM IST
Moratorium: డిసెంబర్ వరకు మారటోరియం... పొడిగించే అవకాశం
Moratorium: డిసెంబర్ వరకు మారటోరియం... పొడిగించే అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశాలతో బ్యాంకులు ఇచ్చిన మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నారా? మీ లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల్ని వాయిదా వేశారా? ప్రస్తుతం మారటోరియం గడువు ఆగస్టులో ముగుస్తుంది. మొదటి విడతలో మార్చి నుంచి మే వరకు, రెండో విడతలో జూన్ నుంచి ఆగస్ట్ వరకు మారటోరియం ప్రకటించింది ఆర్‌బీఐ. కానీ కరోనా వైరస్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. భారతదేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇంకొన్ని నెలలు ఇదే పరిస్థితి ఉండొచ్చు. అదే జరిగితే జనాలకు ఆర్థిక కష్టాలు తప్పవు. అందుకే మారటోరియం డిసెంబర్ వరకు పొడిగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. మారటోరియంను మరో మూడు నెలలు అంటే నవంబర్ వరకు లేదా డిసెంబర్ వరకు పొడిగించాలని బ్యాంకర్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు. మారటోరియం పొడిగించకపోతే ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చెల్లించకపోతే ఎన్‌పీఏలు పెరగొచ్చని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగితే బ్యాంకులకు భారం తప్పదని, అందుకే మారటోరియం పొడిగించాలని అంటున్నారు.

కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే

ఇక ఇప్పటి వరకు 30 శాతం మంది రుణగ్రహీతలు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నట్టు బ్యాంకుల లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా మారటోరియంవైపు మొగ్గు చూపారు. క్రెడిట్ స్కోర్‌కు ముప్పేమీ ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI చెప్పడంతో ఈఎంఐలు వాయిదా వేశారు. ప్రస్తుతం మారటోరియం గడువు ఆగస్టు 31న ముగుస్తుంది. ఆర్‌బీఐ మారటోరియం పొడిగిస్తే ఇప్పటికే లోన్లు వాయిదా వేసినవాళ్లు మారటోరియం కొనసాగించడంతో పాటు కొత్త రుణగ్రహీతలు ఈ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading