Home /News /coronavirus-latest-news /

EXPLAINER HOW OMICRON COVID VARIANT MAY BE GOOD NEWS AMID DEADLY DELTA VARIANT MKS

Explainer : Omicron: షాకింగ్ ట్విస్ట్ -ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి మంచిదేనా? దీని దెబ్బకు డెల్టా వేరియంట్ ఖతం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రమాదకర కొవిడ్ వేరియంట్ గా భావిస్తోన్న ఒమిక్రాన్ గురించి తొలిసారి శుభవార్త వెలువడింది. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తే.. ప్రాణాంతకమైన డెల్టా మ్యుటేషన్ ప్రభావం తగ్గుతుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణాల ప్రమాదం తగ్గుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు..

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్. ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలు లాక్‌డౌన్‌లు విధించాలని చూస్తున్నాయి. భారత్‌తో పాటు అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దక్షిణాఫ్రికా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు మొదటిసారి అందిన నివేదిక ప్రకారం.. ఈ మ్యుటేషన్ చాలా తేలికపాటి కేసులకు మాత్రమే కారణమవుతోందని తెలుస్తోంది. అయితే దీని వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆందోళనరకం వేరియంట్‌గా వర్గీకరించింది. ఈ క్రమంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తే.. ప్రాణాంతకమైన డెల్టా మ్యుటేషన్ ప్రభావం తగ్గుతుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణాల ప్రమాదం తగ్గుతుందని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒమిక్రాన్ ప్రమాదకారి కాదా?
ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ (Dr. Angelique Coetzee). కొత్త మ్యుటేషన్ లక్షణాల గురించి ఆమె ఆదివారం మాట్లాడారు. దీని బారిన పడిన వారికి ఇంట్లోనే చికిత్స చేయవచ్చని చెప్పారు. ప్రైవేట్ ప్రాక్టీషనర్ అయిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ.. సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్‌లపై పంపిణీపై దక్షిణాఫ్రికా నియమించిన మంత్రుల సలహా కమిటీలో కూడా కోయెట్జీ సభ్యురాలు. తాజాగా రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. నవంబర్ 18న తన క్లినిక్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ రోగులకు చికిత్స అందించినట్లు చెప్పారు. వారికి చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం ఏడుగురు రోగులకు చికిత్స అందించగా, వారిలో డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలను గుర్తించినట్లు వివరించారు.

sex doll : రెండో సెక్స్ డాల్ భార్యతో హనీమూన్ -ఆ దెబ్బకు మొదటి భార్య ఢమాల్ -వీడి ప్లాన్ మామూలుగా లేదు..


ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన చాలా మంది రోగుల్లో చాలా తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితుల్లో ఎవరినీ ఐసీయూలో చేర్చలేదని కోయెట్జీ చెప్పారు. రోగులకు ఇంట్లోనే సాధారణ చికిత్స చేయగలిగామని వివరించారు. డెల్టా మాదిరిగా కాకుండా ఇప్పటివరకు రోగుల్లో వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలను గుర్తించలేదని, కొత్త వేరియంట్‌తో బాధితుల ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల సైతం లేదని కోయెట్జీ చెప్పారు.

ఈ వేరియంట్ 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని కోయెట్జీ గుర్తించారు. ఆమె చికిత్స అందించిన ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో దాదాపు సగం మంది టీకాలు తీసుకోలేదని చెప్పారు. అయితే రోగులు ఒకటి లేదా రెండు రోజులు తీవ్రమైన అలసటతో బాధపడుతున్నట్లు క్లినికల్ ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీంతోపాటు తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి సాధారణ లక్షణాలు సైతం వారిలో కనిపిస్తున్నాయని విశ్లేషించారు.

Omicron : డేంజరస్ ఒమిక్రాన్ Mumbaiలోకి ఎంటరైందా? -South Africa నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ఇది శుభవార్త అని నిపుణులు ఎందుకు భావిస్తున్నారు?
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రాథమిక డేటా ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ వ్యాధికారకమైనదని విశ్లేషిస్తున్నారు వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్స్ట్ (Marc van Ranst). అయితే ఎక్కువ ఇన్ఫెక్టివిటీ కారణంగా ఈ మ్యుటేషన్ డెల్టా వేరియంట్‌ను భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెబుతున్నారు మార్క్ వాన్. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటి అనారోగ్యమని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, డెల్టా ప్రభావం తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్ రేటు సైతం తగ్గుతుందని చెబుతున్నారు.

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే..
ఒమిక్రాన్ వేరియంట్‌తో రీఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, డెల్టా సహా ఇతర వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించవచ్చని WHO చెబుతోంది. అయితే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఒమిక్రాన్‌ లక్షణాలు ఇతర మ్యుటేషన్లకు భిన్నంగా ఉన్నాయని సూచించడానికి సైతం ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాచారం లేదని WHO తెలిపింది. బాధిత యువతలో చాలామందిలో తేలికపాటి లక్షణాలు కనిపించినట్లు దక్షిణాఫ్రికా చేపట్టిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కానీ ఒమిక్రాన్ తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవడానికి మరింత డేటా అవసరం. ఇందుకు కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Karimnagar mlc : కమలంలో ముసలం -బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ -బీజేపీలోకి సర్దార్ రవీందర్ సింగ్!వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రభావం ఎలా ఉంటుంది?
వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా ఒమిక్రాన్‌ను కట్టడి చేయవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద విపత్తు కాదని చెబుతున్నారు UK మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ క్యాలమ్ సెంపుల్ (Prof Calum Semple). ఆయన BBCతో మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే అవకాశం ఉందని చెప్పారు. ‘ఇది విపత్తు కాదు. కొత్త వేరియంట్ భయంకరమైనదని కొందరు పరిస్థితిని పెద్దగా చేసి చెబుతున్నారు. టీకాల ద్వారా శరీరానికి అందే రోగనిరోధక శక్తి, తీవ్రమైన వ్యాధి నుంచి మనల్ని రక్షించే అవకాశం ఉంది. బాధితుల్లో జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు, చనిపోయే ప్రమాదాలను మాత్రం వ్యాక్సిన్ గణనీయంగా తగ్గిస్తుంది. ఇలాంటివి భవిష్యత్తులోనూ వెలుగుచూస్తాయి. అయితే రోగనిరోధకత కూడా కొనసాగుతుంది’ అని వివరించారు ప్రొఫెసర్ క్యాలమ్.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Omicron corona variant, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు