హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

BA.2 Variant: భారత్‌లో కలకలం రేపుతున్న BA.2 Variant..ఈ Omicron Sub-Variant ఎందుకిత ప్రమాదకరం అంటే..

BA.2 Variant: భారత్‌లో కలకలం రేపుతున్న BA.2 Variant..ఈ Omicron Sub-Variant ఎందుకిత ప్రమాదకరం అంటే..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఇండోర్ నగరంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ అయిన BA.1, BA.2 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఇండోర్ నగరంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ అయిన BA.1, BA.2 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఇండోర్ నగరంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ అయిన BA.1, BA.2 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.

  ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) ఒమిక్రాన్ సబ్-వేరియంట్ (Omicron Sub-Variant) కలకలం రేపుతోంది. ఇండోర్ నగరంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ అయిన BA.1, BA.2 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇండోర్‌లో ఇప్పటివరకూ 12 మంది ఒమిక్రాన్ రోగులు BA.2 సబ్-వేరియంట్ బారిన పడ్డారు. ఇందులో ఆరుగురు చిన్నారులు కూడా ఉండటం గుబులు రేపుతోంది. ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్‌లో BA.2 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మరో కలవరం కలిగించే విషయం ఏంటంటే.. BA.2 వేరియంట్ ఎక్కువగా మానవ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులను డ్యామేజ్ (Lungs Damage) చేసి మనిషి శ్వాస ఆగిపోయేలా చేస్తుంది.

  ఇది కూడా చదవండి: Children infected with covid : ఒమిక్రాన్ విజృంభణ..ఆ దేశంలో కోటి మందికి పైగా చిన్నారులకు కరోనా

  ఇండోర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బారిన పడిన 17 ఏళ్ల పేషంట్‌‌ను పరీక్షించగా ఇదే విషయం స్పష్టమైంది. అతని ఊపిరితిత్తులు ఈ సబ్ వేరియంట్ సోకిన తర్వాత దాదాపు 40 శాతం ఇన్‌ఫెక్షన్ (Infection) కారణంగా పాడయ్యాయి. మరో ఇద్దరు పేషంట్లు ఐసీయూలో (ICU) చేరి ఆక్సిజన్ సపోర్ట్‌తో (Oxygen Support) చికిత్స పొందుతున్నారు.

  ఒమిక్రాన్ మరో సబ్ వేరియంట్ BA.1 కేసులు ఇండోర్‌లో నాలుగు వెలుగుచూశాయి. ఈ సబ్ వేరియంట్ కారణంగానే యూరప్‌లో కరోనా వేవ్ ఊహించని విధంగా నష్టం చేసింది. ఈ వేరియంట్ ఇప్పటిదాకా 40 దేశాల్లో వ్యాప్తి చెందింది. BA.2 సబ్ వేరియంట్ కూడా యూకేలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. యూకే (UK) వైద్యఆరోగ్య శాఖ BA.2 వేరియంట్‌పై అధ్యయనం జరుపుతున్నామని ఇప్పటికే ప్రకటించింది. డెన్మార్క్‌లో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో సగానికి పైగా BA.2 సబ్ వేరియంట్ కేసులేనని ఆ దేశం ప్రకటించింది.

  ఇది కూడా చదవండి: India Covid Update: కరోనా విలయం: 4కోట్లు దాటిన కేసులు -కొత్తగా 2.8లక్షలు, 665 మరణాలు

  భారత్‌లో కలకలం రేపుతున్న BA.2 సబ్ వేరియంట్..

  * మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కేసులు

  * యూరప్‌లో BA.2 వేరియంట్ కారణంగానే కరోనా శరవేగంగా వ్యాప్తి

  * దాదాపు 40 దేశాల్లో BA.2 సబ్ వేరియంట్ కేసులు ఇప్పటివరకూ వెలుగులోకి

  * జనవరి 10వ తేదీ వరకూ బ్రిటన్ 53 సీక్వెన్సీస్‌ను గుర్తించింది

  * యూకేలో ప్రస్తుతం BA.2 సబ్ వేరియంట్‌పై ముమ్మరంగా కొనసాగుతున్న అధ్యయనాలు

  * ఒమిక్రాన్ మూలాల నుంచి వ్యాప్తి చెందిన BA.2 సబ్ వేరియంట్

  * నేరుగా మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్

  * ఇప్పటికే ఇండోర్‌లో BA.2 సబ్ వేరియంట్ బారిన పడి ఇద్దరు పేషంట్లు ఐసీయూ వెంటిలేటర్‌పై..

  * చిన్నారులపై ప్రభావం చూపుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయం

  భారత్‌లో గత వారం రోజుల్లో కరోనా కేసులు ఏ రేంజ్‌లో పెరిగాయంటే..

  * భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుదల

  * ఒక్క వారంలోనే ఇండియాలో 150 శాతం పెరిగిన కరోనా కేసుల సంఖ్య

  ఇది కూడా చదవండి: Covid: ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం.. మూడో వేవ్ ఉదృతిని తగ్గించిన వ్యాక్సిన్లు: కేంద్రం

  BA.2 సబ్ వేరియంట్ ఎందుకు ప్రమాదకరం..?

  * ఒమిక్రాన్ గత వేరియంట్ BA.1తో పోల్చితే అత్యంత ప్రమాదకారిగా BA.2 సబ్ వేరియంట్

  * RT-PCR టెస్టుకూ అంతుబట్టని BA.2 సబ్ వేరియంట్

  * BA.2 సబ్ స్ట్రెయిన్ మొత్తం 32 స్ట్రెయిన్స్‌గా మ్యుటేషన్ చెందుతుండటంపై ఆందోళన

  * BA.1 సబ్ వేరియంట్‌ను గుర్తించగలుగుతున్న PCR టెస్ట్

  * BA.2 వేగంగా మ్యుటేషన్స్ చెందుతుండటంతో కష్టతరమవుతున్న నిర్ధారణ

  * BA.1తో పోల్చుకుంటే BA.2 అత్యంత వేగంగా వ్యాప్తి

  * BA.2 సబ్ వేరియంట్‌ను ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా చెబుతున్న శాస్త్రవేత్తలు

  * ‘స్టెల్త్ ఒమిక్రాన్’ భవిష్యత్‌లో అత్యంత ప్రమాదకరంగా రూపాంతరం చెందబోతోందని శాస్త్రవేత్తల హెచ్చరిక

  ఇదే సమయంలో.. ఒమిక్రాన్ సబ్-స్ట్రెయిన్ అయిన BA.2ను శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైనది పరిగణిస్తున్నారు. ఇందుకు శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఏంటంటే.. ఒమిక్రాన్ సోకిందో, లేదో తెలుసుకునేందుకు చేస్తున్న RT-PCR టెస్టుకు కూడా BA.2 వేరియంట్ దొరకడం లేదని చెబుతున్నారు. దీంతో.. BA.2 సబ్ వేరియంట్ సోకిందో, లేదో గుర్తించడం కష్టతరంగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. RT-PCR టెస్టుల్లో వినియోగిస్తున్న PCR కిట్స్‌కు కూడా BA.2 సబ్ వేరియంట్ అంతు చిక్కడం లేదని చెప్పారు.


  శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. ఈ BA.2 సబ్ స్ట్రెయిన్ దాదాపు 32 స్ట్రెయిన్స్‌గా రూపాంతరం చెందుతోంది. BA.1 మ్యుటేషన్స్ PCR టెస్టుల్లో గుర్తించడం సులువేనని, కానీ.. BA.2 మ్యుటేషన్స్‌ను మాత్రం గుర్తించలేకపోతున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అందువల్ల ఈ సబ్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం.. BA.1తో పోల్చుకుంటే BA.2 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా.. ఈ BA.2 సబ్ వేరియంట్ భవిష్యత్‌లో అత్యంత ప్రమాదకరంగా రూపాంతరం చెందబోతోంది.

  First published:

  Tags: Corona cases, India, Omicron, Omicron corona variant

  ఉత్తమ కథలు