Omicron XBB : భారతదేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ అక్టోబర్ నెలలోనే మహారాష్ట్రలో 18 ఒమిక్రాన్ XBB (Omicron XBB) సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ సబ్ వేరియంట్ దేశ ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఎందుకంటే నిపుణులు ఈ వేరియంట్ మరొక వేవ్‌కి దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానుంది. ఈ పండుగ సందర్భంగా బంధుమిత్రులందరూ కలుస్తారు. అయితే ఈ సమయంలో ప్రజలందరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొత్త వేరియంట్ గుర్తించిన తర్వాత ఒక్క వారం వ్యవధిలోనే మహారాష్ట్రలో కోవిడ్ కేసులలో 17.7 శాతం పెరుగుదల నమోదైంది. టీకాలు, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఈ సబ్ వేరియంట్ సంక్రమించడం సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ ద్వారా వ్యాపిస్తుంది. రోగనిరోధక శక్తిని దాటుకుని శరీరంలోకి చొచ్చుకుపోగల లక్షణాలు ఈ వేరియంట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణంతో ఈ సబ్-వేరియంట్ పలు దేశాల్లో మరో వేవ్‌కి దారితీయవచ్చని ఓ WHO శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చాక చాలా దేశాలు కోవిడ్ కేసుల పెరుగుదలను చూస్తున్నాయి.
Loan Offers: దీపావళికి బ్యాంకుల స్పెషల్ ఆఫర్లు.. తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..
టీకాలు తీసుకున్న వారికీ సోకిన వైరస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల్లో పరిస్థితిని పర్యవేక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్లు ఇవ్వలేదు. కాబట్టి వారికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలో గుర్తించిన మొత్తం 18 XBB సబ్-వేరియంట్ కేసులలో 13 పుణే, 2 నాగ్‌పూర్, 2 థానే, ఒకటి మహారాష్ట్రలోని అకోలా జిల్లా నుంచి వచ్చాయి. పుణేలో BQ.1, BA.2.3.20 సబ్-వేరియంట్ల కేసును ఒక్కోటి చొప్పున బయటపడ్డాయి. మొత్తంగా నమోదైన ఈ 20 కేసుల్లో 15 మంది కోవిడ్-19కి వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి
దేశంలో కొత్త సబ్-వేరియంట్ వెలుగులోకి వచ్చిన వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులలో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని, ఈ ఫెస్టివల్ సీజన్లో మిగతా జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరమని ఆ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని సకాలంలో అంచనా వేయడానికి.. నియంత్రించడానికి తగిన పరీక్షలు, సమర్థవంతమైన కోవిడ్-19 వ్యాప్తి పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి నొక్కి చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ముందు జాగ్రత్త డోస్‌తో సహా టీకా వేగాన్ని పెంచాలని ఆయన సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Covid-19, Diwali 2022