హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid-19: కరోనా సోకినా డ్యూటీ చేయవచ్చు.. అక్కడ ఇవే  స్పెషల్ రూల్స్.. ఎందుకంటే..?

Covid-19: కరోనా సోకినా డ్యూటీ చేయవచ్చు.. అక్కడ ఇవే  స్పెషల్ రూల్స్.. ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కెనడాలోని క్యూబెక్‌ అనే ప్రావిన్స్‌లో కరోనా వచ్చినా.. కార్మికులు వర్క్ చేసుకోవచ్చు. ఈ నగరంలో ఇప్పుడు కరోనా బారిన పడిన హెల్త్‌కేర్ వర్కర్లు పని చేస్తూనే ఉన్నారు. క్యూబెక్‌ ప్రభుత్వమే పని చేసుకోవడానికి వారికి అనుమతి ఇచ్చింది.

సాధారణంగా కరోనా సంక్రమిస్తే వెంటనే ఎవరైనా సరే స్వీయ-నిర్బంధంలోకి వెళ్లిపోతారు. కరోనా నెగిటివ్(Corona Negative) అని నిర్ధారణ అయ్యేంతవరకు బయట ప్రపంచంలోకి రారు. వారి నుంచి ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఆవశ్యకం. కానీ కెనడా(Canada)లోని క్యూబెక్‌ అనే ప్రావిన్స్‌లో కరోనా వచ్చినా.. కార్మికులు వర్క్(Work)  చేసుకోవచ్చు. ఈ నగరంలో ఇప్పుడు కరోనా బారిన పడిన హెల్త్‌కేర్ వర్కర్లు(Health Care Workers) పని చేస్తూనే ఉన్నారు.

క్యూబెక్‌ ప్రభుత్వమే పని చేసుకోవడానికి వారికి అనుమతి ఇచ్చింది. ఇందుకు కారణం ఈ ప్రావిన్స్‌లో కరోనా రోగుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోవడమేనని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి నియంత్రణలోకి రావాలంటే మహమ్మారి సోకిన హెల్త్‌కేర్ వర్కర్లను విధులు నిర్వర్తించేందుకు అనుమతించడం తప్ప మరే ఇతర మార్గం లేదని అక్కడి ఆరోగ్య మంత్రి క్రిస్టియన్ డ్యూబ్ మంగళవారం తెలిపారు.

అత్యధిక జనాభా కలిగిన రెండో కెనడియన్ ప్రావిన్స్ అయిన క్యూబెక్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్(Omicron) విలయతాండవం చేస్తోంది. అక్కడ వేల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్ ఆ ప్రాంతంలో కొత్త వేవ్‌కు కూడా దారి తీసింది. దీంతో సోమవారం రోజు 12,833 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు కొత్తగా మరో 13,149 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 24 గంటల సమయంలో ఈ స్థాయిలో కేవలం ఒకే ఒక ప్రాంతంలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ సిబ్బంది కరోనా పేషెంట్ల ప్రాణాలకు శ్రీరామరక్షగా మారారు.

Indian Army: రక్షణ దళాల బలోపేతానికి భారత సైన్యం చర్యలు.. ఆయుధాల భద్రత కోసం కీలక నిర్ణయాలు..


కరోనా బాధితులకు సేవలందిస్తున్న సమయంలో వారు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. వైద్యరంగానికి వెన్నుముకగా నిలిచిన వీరిలో ఏ ఒక్కరూ డ్యూటీలకు రాకపోయినా పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని క్యూబెక్‌ ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. కేసులతో పాటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యే రోగుల సంఖ్య కూడా రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఫ్రంట్‌లైన్‌ కార్మికులు కోవిడ్-19 బారిన పడినా వారిని డ్యూటీ కంటిన్యూస్‌గా నిర్వర్తించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హెల్త్ కేర్ సిబ్బంది కొరత ఏర్పడకుండా.. ఆరోగ్య సంరక్షణ సేవలకు ఆటంకం కలిగించకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి క్రిస్టియన్ డ్యూబ్ వివరించారు.

Covid Symptoms: డెల్టా వర్సెస్ ఒమిక్రాన్‌.. కొత్త వేరియంట్‌ బాధితుల్లో భిన్నంగా ఉండే లక్షణాలు ఇవే..!


"ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల భారీ సంఖ్యలో ఆరోగ్యం సిబ్బంది తమ డ్యూటీల నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి క్యూబెక్‌ ప్రజలకు చికిత్స చేసే హెల్త్ కేర్ సామర్థ్యాన్ని తగ్గించే పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఒక నిర్దిష్ట పరిస్థితిలో పాజిటివ్ వచ్చిన సిబ్బంది కూడా పనిచేసేందుకు అనుమతి ఇచ్చాం. రిస్క్ మేనేజ్‌మెంట్ జాబితా ప్రకారం వారు విధులు నిర్వర్తించేందుకు అనుమతించాలని మేం నిర్ణయం తీసుకున్నాం,” అని డ్యూబ్ ఒక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

క్యూబెక్ జనవరి 4 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మూడవ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను కూడా అందజేస్తుందని డ్యూబ్ వెల్లడించారు. గత వారం క్యూబెక్ అధికార యంత్రాంగం బార్‌లు, జిమ్‌లు, కాసినోలను మూసివేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో కూడా కఠిన ఆంక్షలు విధించింది.

First published:

Tags: Canada, Covid -19 pandemic

ఉత్తమ కథలు