• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • EUROPES OLDEST PERSON HAS SURVIVED COVID 19 AFTER TESTING POSITIVE JUST A FEW WEEKS BEFORE HER 117TH BIRTHDAY NS GH

Covid-19: కరోనా నుంచి కోలుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె స్టేట్మెంట్ చూస్తే షాకవుతారు..

Covid-19: కరోనా నుంచి కోలుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె స్టేట్మెంట్ చూస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి 70 ఏళ్లకుపైబడిన చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. 100 ఏళ్లకు పైబడిన వారు కూడా కోవిడ్ నుంచి బయటపడ్డారు. అయితే 116 ఏళ్ల వయసులో మహమ్మారి నుంచి బయట పడి వార్తల్లో నిలిచింది ఓ బామ్మ.

  • Share this:
కోవిడ్-19.. ఎంతో మంది ప్రాణాలను హరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కలకలం సృష్టించిన కరోనా వ్యాక్సిన్ ను ఇప్పుడిప్పుడే పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వారిలో వృద్ధులు ఎక్కువగా ఈ మహమ్మారికి బలైపోయారు. అయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి 70 ఏళ్లకుపైబడిన చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. 100 ఏళ్లకు పైబడిన వారు కూడా కోవిడ్ నుంచి బయటపడ్డారు. అయితే 116 ఏళ్ల వయసులో మహమ్మారి నుంచి బయట పడి వార్తల్లో నిలిచింది ఓ బామ్మ.
దక్షిణ ఫ్రాన్స్ లోని టౌలన్ కు చెందిన ఆండ్రే అనే పునీత(Nun) జనవరి 16న కరోనా బారిన పడింది. అనంతరం ఐసోలేషన్ కు వెళ్లి తగిన చికిత్స తీసుకొని కోవిడ్ నుంచి బయపడింది. ఇటీవలే ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆమెను డిశ్చార్జి చేసినట్లు స్థానిక నర్సింగ్ హోం డైరెక్టర్ డేవిడ్ టావిల్లా తెలిపారు. గురువారం నాడు సిస్టర్ ఆండ్రె తన 117వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కరోనా నుంచి బయటపడటం గురించి ఆమె స్పందించింది. "నాకు వచ్చిందని తెలీదు. అయినా నేను భయపడలేదు. ఎందుకంటే చావు అంటే నాకు భయం లేదు. కరోనా అనేది ఇలా వచ్చి వెళ్లిపోతుంది. ఇంతకు మించిన నాకు తెలియదు" అని ఇంటర్వ్యూలో బదులిచ్చారు.

అయితే పుట్టిన రోజు వేడుకలకు ఎవ్వరినీ అనుతించట్లేదని, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటుందని టావెల్లా తెలిపారు. వీడియో సందేశాల రూపంలో వచ్చిన వాటికి రిప్లయి తెలుపుతుందని, ఆమెను సంతోషంగా ఉంచడమే తామ ప్రాధాన్యమని చెప్పారు. 1904లో జన్మించిన ఆండ్రే పోయ్ గ్రాస్, బేకెడ్ అలస్కా, ఓ గ్లాసు వైను మాత్రమే ఆహారంలో భాగంగా తీసుకుంటుందని తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో తప్పనసరిగా ఓ గ్లాసు వైను తాగుతారని ఆయన అన్నారు.
ఆండ్రే ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. పిల్లలను చాలా మర్యాదపూర్వకంగా చూసుకుంటుందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆండ్రే 1944లో పునీతగా మారారు. 2009 నుంచి టౌలోన్ నర్సింగ్ హోంలో నివాసముంటున్నారు. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు.

1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారిని కూడా తట్టుకుని జీవించారు. జెరోంటాలజీ రిసెర్చ్ ప్రకారం 1903 జనవరి 2న జన్మించిన జపనీస్ మహిళ కేన్ తనకా భూమిపై అత్యధిక వయస్సున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఆండ్రె రెండో స్థానంలో నిలించింది. బతికున్న వారిలో అత్యధిక వయసున్న ఫ్రాన్స్ కు చెందిన వ్యక్తిగా ఆండ్రే గుర్తింపు తెచ్చుకున్నారు. 2017 అక్టోబరులో చనిపోయిన హోనోరిన్ రోండేళ్లో 122 ఏళ్లు బతికారు. ఆయన తర్వాత ఇదే దేశానికి చెందిన జీన్ కాల్మెంట్ కూడా 122 ఏళ్లు జీవించారు.
Published by:Nikhil Kumar S
First published: