Home /News /coronavirus-latest-news /

Covid Releif fund: భారత్‌కు భారీ విరాళమిచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఏకంగా రూ.7,300 కోట్లు

Covid Releif fund: భారత్‌కు భారీ విరాళమిచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఏకంగా రూ.7,300 కోట్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షిబా కాయిన్ అనేది ఓ ప్రముఖ క్రిప్టో కరెన్సీ. ఎలాన్ మస్క్ డాగీ కాయిన్ మాదిరిగా లావాదేవీలు చేయడానికి మధ్యవర్తిత్వంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో ఈ కాయిన్ విలువ పెరుగుతోంది.

కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు భారత్‌కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, దేశాధినేతలు తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫాం ఎథెరియం సహా వ్యవస్థాపకులు విటాలిక్ బూటెరిన్ భారత్‌కు భూరీ విరాళం ప్రకటించారు. దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన షిబా ఇను కాయిన్ (డాగీ కాయిన్ స్పిన్ ఆఫ్ క్రిప్టో)లు భారత కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. 27 ఏళ్ల ఈ రష్యన్ కెనడియన్ ప్రోగ్రామర్ తన పబ్లిక్ వాలెట్ నుంచి 50 ట్రిలియన్ షిబా కాయిన్లను బుధవారం నాడు భారత కోవిడ్- క్రిప్టో సహాయనిధికి బదిలీ చేశారు. ఇది మాత్రమే కాకుండా 500 ఈథర్ (1.9 మిలియన్ డాలర్లు)ను సైతం విరాళం ఇచ్చారు. వీటి మొత్తం విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉండటం విశేషం. అంటే దాదాపు రూ.7,300 కోట్లు.

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ చాలా అస్థిరంగా ఉంది. కాయిన్ బేస్ ప్రకారం గురువారం నాడు.. బూటేరిన్ బదిలీ చేసిన బిలియన్ డాలర్ల క్రిప్టో విలువ 30 శాతం తగ్గింది. షిబా కాయిన్ అనేది ఓ ప్రముఖ క్రిప్టో కరెన్సీ. ఎలాన్ మస్క్ డాగీ కాయిన్ మాదిరిగా లావాదేవీలు చేయడానికి మధ్యవర్తిత్వంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో ఈ కాయిన్ విలువ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ప్రత్యామ్నాయ బిట్ కాయిన్లలో ఇది కూడా ఒకటి. బూటెరిన్ విరాళంగా ఇచ్చిన షిబా ఇను కాయిన్లను గతంలో ఆయన బహుమతి రూపంలో అందుకున్నారు. 19 ఏళ్ల వయసులో బుటెరిన్ 2013లో ఎథెరియంను స్థాపించారు. మే 4 నాటికి ఈ డిజిటల్ కరెన్సీ విలువ 3500 డాలర్లుగా ఉంది. గత వారం అధికంగా 4385 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం దీని విలువ 3700 డాలర్లుగా ఉంది.



ప్రస్తుతం భారత్ కోవిడ్ కేసుల సంఖ్య కొద్దిమేర తగ్గుతున్నాయి. అయినప్పటికీ తీవ్రత మాత్రం అలాగే ఉంది. గడిచిన 24 గంటల్లో నాలుగు వేలకు మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. వరుసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గాయి. 3 లక్షలకు దిగువకు నమోదయ్యాయి. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 2,81,386 మందికి పాజిటివ్ గా తేలింది. ఏప్రిల్ 20 తర్వాత ఇదే అత్యల్పం. ప్రస్తుతం దేశంలో 35,16,997 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు టీకా కార్యక్రమం కూడా వేగం పుంజుకుంది. ఆదివారం నాడు 6,91,211 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, COVID-19 cases

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు