హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

15 రోజుల్లో రూ.950 కోట్ల‌ పీఎఫ్ విత్ డ్రా: లక్ష‌లాది ఉద్యోగుల రిక్వెస్ట్

15 రోజుల్లో రూ.950 కోట్ల‌ పీఎఫ్ విత్ డ్రా: లక్ష‌లాది ఉద్యోగుల రిక్వెస్ట్

15 రోజుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువకు సంబంధించి 3.31 లక్షల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించినట్టు కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది.

    క‌రోనా ఎఫెక్ట్ తో ఉద్యోగులు భారీగా ఈపీఎఫ్ సొమ్మును విత్ డ్రాయ‌ల్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా ప‌లు కంపెనీలు నష్టాల్లోకి జారిపోవ‌డంతో ఉద్యోగుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డంలేదు. దీంతో మూడు నెల‌ల బేసిక్ జీతం, డీఏ లేదా మొత్తం పీఎఫ్ లో 75 శాతం, రెండింటిలో ఏది త‌క్కువ ఉంటే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తూ గ‌త నెల 26న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న స్కీంను వినియోగించుకుంటున్నారు వేత‌న జీవులు. రిక్వెస్ట్ వ‌చ్చిన 72 గంట‌ల్లోనే ప్రాసెస్ పూర్త‌యిపోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

    గడచిన 15 రోజుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువకు సంబంధించి 3.31 లక్షల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించినట్టు గురువారం కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈపీఎఫ్‌ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ స్కీమ్‌ నోటిఫికేషన్‌ మార్చి 28న వెలువడింది.

    First published:

    Tags: Corona virus, Coronavirus, EPFO

    ఉత్తమ కథలు