హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Coronavirus Effect: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ

Coronavirus Effect: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ

Coronavirus: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ
(ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఇలా చేయమంటున్న ఈపీఎఫ్ఓ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO Alert | ఈపీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన పనులేమైనా ఉన్నాయా? ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో ఏమైనా పనుందా? కరోనా వైరస్ భయంతో ఆఫీసులకు రావొద్దంటోంది ఈపీఎఫ్ఓ.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తన మెంబర్స్‌కి, పెన్షనర్లకు, ఉద్యోగులకు పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ భయాలు నెలకొనడంతో ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు రావొద్దని, ఆన్‌లైన్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయొచ్చని, సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో సేవలు పొందొచ్చని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

  ఈపీఎఫ్ఓలో అనేక ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంప్లాయీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN జనరేట్ చేయడం, యూఏఎన్ యాక్టివేట్ చేయడం, ఆధార్‌, పాన్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్‌తో లింక్ చేయడం లాంటి సర్వీసులన్నీ ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఉద్యోగులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు. పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేయొచ్చు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. వీటితో పాటు ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్సులు లేదా ఫైనల్ విత్‌డ్రా క్లెయిమ్స్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌ బెనిఫిట్స్ కూడా ఆన్‌లైన్‌లోనే పొందొ అవకాశముంది. పీఎఫ్, పెన్షన్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ నేరుగా సబ్‌స్క్రైబర్ అకౌంట్‌లోకే వెళ్తుంది.

  పెన్షనర్లు కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేయొచ్చు. ఆ కాపీని డిజీలాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు. తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా యూఏఎన్ లేదా పాస్‌బుక్‌లో పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ నెంబర్ తెలుసుకోవచ్చు. పెన్షనర్లు తమ జీవన్ ప్రమాన్-డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లోనే అప్డేట్ చేయొచ్చు.

  ఇవి కూడా చదవండి:

  IRCTC: రైలు టికెట్ బుక్ చేసినవారికి ఊరట... ఈ రూల్స్ మారాయి

  Reliance Jio: గుడ్ న్యూస్... జియో యూజర్లకు డబుల్ డేటా

  March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 చివరి తేదీ... వివరాలివే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Pension Scheme, Pensioners

  ఉత్తమ కథలు