హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

EPFO: కరోనా కష్టకాలం... ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా?

EPFO: కరోనా కష్టకాలం... ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా?

EPFO: కరోనా కష్టకాలం... ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: కరోనా కష్టకాలం... ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

EPF Pandemic Advance Facility | కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారా? గత నాలుగు నెలల్లో ఎన్ని వేల కోట్లు డ్రా చేశారో తెలుసుకోండి.

  కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య సంక్షోభాన్ని మాత్రమే కాదు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. లక్షల ఉద్యోగాలకు ముప్పు తప్పలేదు. జాబ్ మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడింది. చిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ పొదుపు చేసుకున్న డబ్బుల్ని ఇప్పుడు ఖర్చులకు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలనెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లో డబ్బులు జమ చేసిన ఉద్యోగులు కూడా వాటిని విత్‌డ్రా చేసుకుంటున్నారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ 19 కారణాన్ని చూపిస్తూ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. పలు కారణాలతో గత నాలుగు నెలల్లో ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా రూ.30,000 కోట్లు విత్‌డ్రా చేసినట్టు తెలుస్తోంది.

  EPF Balance: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

  EPFO: ఈ విషయం తెలిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.50,000 లాభం

  EPF Pandemic Advance Facility, epf covid 19 relief, epf covid 19 withdrawal limit, epf covid 19 advance how many times, epf covid 19 claim amount, EPFO, ఈపీఎఫ్ కోవిడ్ 19 అడ్వాన్స్, ఈపీఎఫ్ విత్‌డ్రా, ఈపీఎఫ్ అడ్వాన్స్, ఈపీఎఫ్ క్లెయిమ్, ఈపీఎఫ్ఓ
  ప్రతీకాత్మక చిత్రం

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన తర్వాత క్లెయిమ్ రిక్వెస్ట్‌లు పెరిగాయి. పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ద్వారా ఉద్యోగులు తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి మూడు నెలల బేసిక్ వేతనం లేదా జమ చేసిన మొత్తంలో 75 శాతం వరకు వీటిలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని 30 లక్షల మంది రూ.8,000 కోట్లు విత్‌డ్రా చేయగా, 50 లక్షల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఇతర కారణాలతో తమ ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి రూ.22,000 కోట్లు విత్‌డ్రా చేశారని అంచనా. ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోత, ఆస్పత్రి ఖర్చుల కోసం ఉద్యోగులు తమ సేవింగ్స్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాల్సి వచ్చింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నకొద్దీ ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి విత్‌డ్రాయల్స్ పెరుగుతున్నాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

  ఉత్తమ కథలు