హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా (ప్రతీకాత్మక చిత్రం)

EPF interest rate 2019-20 | కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలు, వర్గాలపై తీవ్రంగా పడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా షాక్ తప్పేలా లేదు. ఎందుకో తెలుసుకోండి.

  మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా? ప్రతీ నెల మీ జీతంలోంచి డబ్బులు జమ చేస్తుంటారా? ఈపీఎఫ్ ఇచ్చే అధిక వడ్డీ మీకు కలిసొస్తుందని భావిస్తున్నారా? అయితే మీకు షాక్ తప్పదు. 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 8.50 శాతం వడ్డీ చెల్లించే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీని 2019-20 సంవత్సరానికి 8.50 శాతానికి తగ్గించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 8.50 శాతం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేదన్న వార్తలు ఖాతాదారులకు మరో షాక్ ఇస్తున్నాయి. ఇందుకు కారణం కరోనా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడమే. ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్-ETF లో ఈపీఎఫ్ఓ మార్చి 11 నాటికి సుమారు రూ.95,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కానీ రిటర్న్స్ ఆశించిన స్థాయిలో లేవు. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-WHO కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో రక్తపాతం కనిపిస్తోంది. అంతకంతకూ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన ఈపీఎఫ్ఓకు కూడా భారీ నష్టాలు తప్పట్లేదు.

  ఈపీఎఫ్ఓ దగ్గర జమైన మొత్తంలో 2015 లో 5 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2017 మేలో 15 శాతం వరకు పెట్టుబడి పెట్టింది. గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ ద్వారా వచ్చే రిటర్న్స్‌తో ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీ చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 6న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈటీఎఫ్‌ల ద్వారా వచ్చే రిటర్న్స్‌తో చెల్లించాలనుకున్నారు. కానీ ఆ సమావేశం తర్వాత మార్కెట్లు దారుణంగా పడ్డాయి. మార్చి 18న సెన్సెక్స్, నిఫ్టీ మూడేళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఏకంగా 2008 నాటి మాంద్యాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం నష్టాలు తప్ప లాభాలు లేకపోవడంతో ఆ ప్రభావం ఖాతాదారులకు చెల్లించాల్సిన వడ్డీపై పడే అవకాశముంది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది కాబట్టి అదే మాట మీద ఉంటారా? లేక ఖాతాదారులకు చెల్లించే వడ్డీపై కోత విధిస్తారా అన్నది చూడాలి.

  ఇవి కూడా చదవండి:

  Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ రూల్స్ మారాయి

  Savings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నారా? అయితే మీకు షాకే

  4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Nifty, Pension Scheme, Pensioners, Personal Finance, Sensex, Stock Market

  ఉత్తమ కథలు