
చైనా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ (Image: @Reuters/Twitter)
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు చైనా కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈజిప్ట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన ఫార్మా కంపెనీ సినోఫార్మ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ జనవరిలోనే అందుబాటులోకి రానుందని ఆ దేశం తెలిపింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు చైనా కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈజిప్ట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన ఫార్మా కంపెనీ సినోఫార్మ్ (Sinopharm) సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ జనవరిలోనే అందుబాటులోకి రానుందని ఆ దేశం తెలిపింది. చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఈజిప్షియన్ ఫార్మాస్యూటికల్ అధారిటీ ఆమోదం తెలిపిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి హలా జాయేద్ తెలిపారు. ఈ చైనా వ్యాక్సిన్ తొలిదశ డిసెంబర్లో డెలివరీ అయింది. రెండో దశ డోసులు ఈ నెలలోనే డెలివరీ చేయనున్నారు. జనవరి మూడో వారంలో కరోనా వ్యాక్సిన్ షిప్మెంట్ ఈజిప్ట్ చేరుకోనుంది. అది రాగానే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఆ దేశమంత్రి తెలిపారు. ప్రతి బ్యాచ్‌లో 50,000 డోసులు ఉంటాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మొదటి దశలో మెడికల్ వర్కర్లకు వ్యాక్సినేషన్ వేయనున్నారు. చైనా నుంచి మొత్తం 40 మిలియన్ల డోసులను కొనుగోలు చేయనున్నట్టు జాయేద్ తెలిపారు. అరబ్ దేశాల్లో అత్యంత జనాభా ఉన్న దేశం ఈజిప్ట్. అక్కడ 100 మిలియన్ల (10 కోట్లు) జనాభా ఉన్నారు. ఈజిప్ట్‌లో 1,40,000 కేసుల కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. వారిలో 7800 మంది మరణించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 03, 2021, 20:06 IST