Education on wheels : ఫ్రీ బుక్ హౌస్... విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ...

Education on wheels : ఓవైపు కరోనా కోరల్లో ముంబై చిక్కుకున్న సమయంలో... తమ భవిష్యత్తు ఏంటా అని విద్యార్థులు ఆందోళన పడుతుంటే... ఈ ఫ్రీ బుక్ హౌస్ వారిలో ఒకింత కాన్ఫిడెన్స్ నింపుతోంది.

news18-telugu
Updated: June 14, 2020, 2:53 PM IST
Education on wheels : ఫ్రీ బుక్ హౌస్... విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ...
ఫ్రీ బుక్ హౌస్... విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ... (credit - twitter - ANI)
  • Share this:
కరోనా వైరస్ మహారాష్ట్రను ముంచుతోంది కదా. మరి అక్కడ ప్రజల జీవన శైలి మారిపోతోంది. ముఖ్యంగా ముంబైలో రోజురోజుకూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడో కొత్త ప్రపంచం కావాలని అంతా కోరుకుంటున్నారు. కరోనా వస్తుందనీ... దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలని ముందుగా ఎవరూ ప్రిపేర్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటూ... ప్రయోగాలు చేసుకుంటున్నారు. కొన్ని నెలలపాటూ పూర్తిగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని ముంబై ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రభుత్వం ఇలా చేయిస్తుందేమో అనే డౌట్ వాళ్లలో ఉంది. అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రజల దగ్గర డబ్బు లేదు. చేద్దామంటే పనిలేదు. దుకాణాలకు వ్యాపారం లేదు. హోటళ్లకు ప్రజలు వెళ్లట్లేదు. ప్రయాణాలూ లేవు. అంతా స్తంభించిపోయింది.

స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. 2020 విద్యా సంవత్సరం కచ్చితంగా ఇదివరకట్లా ఉండే అవకాశం లేదు. అసలు పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులే సిద్ధంగా లేరు. అంతా అనిశ్చితే. ప్రస్తుతం అన్‌లాక్ కారణంగా... చాలా వరకూ తెరచుకున్నా... స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో అర్థం కావట్లేదు. కొన్ని ప్రైవేట్ సంస్థలు... ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాయి. ఐతే... ఇప్పుడు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సమస్య తలెత్తింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సియోన్ ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్... ముంబైలోని... సియోన్ ఏరియాలో మొబైల్ బుక్ కార్ట్ ప్రారంభించింది. ఈ కార్ట్ ద్వారా... టెక్ట్స్ బుక్స్ లేని పిల్లలకు అవి చేరువవుతాయి. పిల్లల ఇళ్ల దగ్గరకే బండి వెళ్తుంది. ఎవరికి కావాల్సిన బుక్స్ వారు ఉచితంగా తీసుకోవచ్చు. అలాగే... తమకు అవసరం లేని టెక్ట్స్ బుక్స్‌ని ఈ బండికి ఉచితంగా ఇచ్చేయవచ్చు. తద్వారా వాటిని వేరే అవసరమైన విద్యార్థులు పొందగలరన్నది ఈ కాన్సెప్ట్ ఉద్దేశం.



దీన్ని ఫ్రీ బుక్ స్టోర్ అని పిలుస్తున్నారు. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతోంది. సపోజ్ ఐదో తరగతి చదివిన పిల్లాడు... ఆ టెక్ట్స్ బుక్స్ ఇచ్చేసి... ఆరో తరగతి బుక్స్ ఫ్రీగా పొందుతాడు. రూపాయి ఖర్చు లేకుండా బుక్స్ మొత్తం చేతికొస్తాయి. ఈ బండిని చేత్తో నడుపుతున్నారు. అందువల్ల దీనికి పెట్రోల్ ఖర్చు కూడా లేదు. ఈ బండి సియోన్‌లో వారానికోసారి ఇంటింటికీ వస్తుంది. తద్వారా... ఓ వారంలో ఏదైనా టెక్ట్స్ బుక్ లభించని విద్యార్థికి... నెక్ట్స్ వీక్‌లో దాన్ని పొందే వీలు కలుగుతోంది.విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బండి కాన్సెప్ట్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ముంబైలో లక్ష కరోనా కేసులు దాటిన సమయంలో... ఇల్లు కదలకుండా కావాల్సిన బుక్స్ పొందడం మంచి విషయం అంటున్నారు. ప్రస్తుతం బుక్స్ షాపులు పెద్దగా తెరచిలేవు. తెరిచినవాటిలో అన్ని రకాల టెక్ట్స్ బుక్సూ లేవు. అదే ఈ బండిలో మాత్రం అన్నీ ఉంటున్నాయి. మహారాష్ట్రతోపాటూ... మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి స్టార్ట్ చేస్తే మంచిదే అంటున్నారు. నిజమే కదా.
Published by: Krishna Kumar N
First published: June 14, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading