Andhra Pradesh: చనిపోయిన మృతదేహానికి పరీక్షలు. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఛీ ఇంత కక్కుర్తా

నాగ లలిత ఫైల్ ఫోటో

తిరుపతిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు సిబ్బంది కాసుల కక్కుర్తి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతదేహానికి ఈసీజీ పరీక్షలు చేయడమే కాదు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయం చేశారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • Share this:
  ఠాగూర్ సినిమాలో సీన్ తిరుపతిలో రిపీట్ అయ్యింది. చనిపోయిన మృతదేహానికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ పరీక్షలు చేయడం వెనుక ఉద్దేశం చూసి.. ఛీ మరి ఇంత కక్కుర్తా అని మృతురాలి బంధువులు  మండిపడుతున్నారు. కాసుల కక్కుర్తితో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా కష్టకాలంలోనూ మనుషుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నా.. ఆస్పత్రి సిబ్బంది కాసుల కక్కుర్తి మాత్రం తీరడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  కరోనా మహమ్మారి.. దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. కరోనా బారిన పడి.. ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు బాధితులు. ఖర్చు ఎక్కువైనా తమకు నయం అవుతుందని ఆశతో ప్రభుత్వ ఆస్పత్రులను కాదని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అలా వచ్చిన వారి.. కష్టాన్ని కూడా తమకు కాసులు కురిపించే వనరుగా మార్చేసుకుంటున్నాయి ప్రైవేటు ఆస్పత్రులు.

  ప్రాణాలతో ఉన్నవారు ఆస్పత్రికి వస్తే వారి ప్రాణాలు తీసేదాక నిలువు దోపీడి చేస్తున్న ఘటనలు చాలానే చూస్తున్నాం.. అయితే చనిపోయిన వ్యక్తిని కూడా వదలలేదు ఆ హాస్పిటల్ సిబ్బంది. తిరుపతిలోని అక్కారం పల్లిలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

  పుంగనూరు మండలానికి చెందిన కోదండ పానికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏప్రిల్ 25న తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. మరోవైపు అతడి భార్య నాగ లలితకు.. రెండు రోజుల తరువాత కరోనా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 27వ తేదీన తాను ఉన్న అదే ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు.

  ఆమెకు ఆక్సిజన్ సాచురేషన్ పూర్తిగా తగ్గడంతో కృతిమ ఆక్సిజన్ తో వైద్యం అందిచారు. కరోనా శరీర భాగంలో మరింత తీవ్ర తరం కావడంతో.. ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. నాగ లలిత ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో వేకువజామున ఉదయం 1.30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. తమ్ముడి భార్య మరణ వార్త విన్న గోవింద స్వామి అసుపత్రికి చేరుకొని. మృతి చెందిన నాగ లలిత మృతదేహాన్ని దహనక్రియల కోసం తరలించేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు.

  అయితే ఏ ఆసుపత్రిలోలేని విధంగా.. చనిపోయిన మృత దేహానికి ఈసీజీ తీయాలని డాక్టర్ చెప్పడంతో బాధితులు షాక్ తిన్నారు. ఎందుకని ప్రశ్నించినా పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది.. ఆ మృత దేహానికి ఈసీజీ తీసేందుకు తరలించారు. ఓ గంట తరువాత నాగ లలిత మృతదేహాన్ని గోవింద స్వామికి అప్పజెప్పారు.

  ఇదీ చదవండి: ఏపీలో మోగుతున్న పెళ్లి బాజా.. కానీ అనుమతి తప్పని సరి? ఏంటా కండిషన్లు

  అప్పుడు అసలు కథ వెలుగులోకి వచ్చింది. కరోనా పేరుతో మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి అల్లుడైన హేమంత్ కు అప్పగించారు. అయితే ఆ మృతదేహంపై ఉన్న బంగారు ఆభరణాలు లేవని గుర్తించిన బంధువులు. ఆసుపత్రి యాజమాన్యానికి పిర్యాదు చేసారు. కానీ డ్యూటీ డాక్టర్ తో సహా అక్కడి నర్సులు బాధిత బంధువులపై ఎదురు దాడికి దిగారు. తమ సిబ్బంది అలంటి వారు కాదని. మీకు చేతనైంది చేసుకోండి అంటూ తిరిగి బెదిరించారు. ఏం చేయాలో తెలియక అలిపిరి పోలీసులను బాధితులు ఆశ్రయించారు.

  ఇదీ చదవండి: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం. విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతిపై ఫోకస్

  కోవిడ్ చికిత్స కోసమని ఆసుపత్రికి వస్తే మృతదేహం పై ఉన్న 60 గ్రాముల బంగారు ఆభరణాలు.. మాయమైయ్యాయని బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగ లలిత మేడలో ఉన్న..బంగారు గొలుసుతో పాటు, తాళి బొట్టు మాయం చేసారని.., కేవలం ఆమె చెవిలో ఉన్న కమ్మలు, వెండి కాళ్ళ పట్టిలు మాత్రమే బంధువులకు అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
  Published by:Nagesh Paina
  First published: