కరోనా వైరస్ పుణ్యమంటూ నిజంగానే విపత్కర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోంది. చివరకు కట్టుకున్న భర్త చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొనలేని దుస్థితి నెలకొంది. కన్నవాళ్ల అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పూర్తివివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జిట్టా మాధవరెడ్డి దంపతులకు నలుగురు కుమార్తెలు. వారందరికీ పెళ్లిళ్లు చేశారు. అందులో ఓ కుమార్తె అమెరికాలో స్థిరపడింది. అయితే మాధవరెడ్డి భార్య అమెరికాలోని కూతురి వద్ద కొద్ది రోజుల పాటు ఉండి వచ్చేందుకు అమెరికా వెళ్లింది. ఈలోపే కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయింది. దీంతో రెండు నెలలుగా మాధవరెడ్డి ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మాధవరెడ్డి గుండెపోటుతో కన్నుమూశాడు.
అయితే ఈ సమాచారం తెలిసినా లాక్‌డౌన్ కారణంగా మాధవరెడ్డి భార్య అమెరికా నుంచి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బంధువులే మాధవరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. లాక్‌డౌన్ పుణ్యమంటూ 50 ఏండ్లు కాపురం చేసిన భర్త చివరి చూపునకు నోచుకోలేక ఆమె పడిన వేదన అంతాఇంతా కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Lockdown, Telangana