థాయిలాండ్‌లో దండెత్తిన వందల కోతులు... భయపెడుతూ... ఆహారం లాక్కుంటూ...

థాయిలాండ్ అనగానే సముద్ర తీరాలు, పర్యాటకుల సందడి గుర్తురావడం సహజం. ఇప్పుడో... పరిస్థితి మారింది. కరోనా అంతగాలేకపోయినా, సమస్యలు అలాగే ఉన్నాయి.

news18-telugu
Updated: June 29, 2020, 2:17 PM IST
థాయిలాండ్‌లో దండెత్తిన వందల కోతులు... భయపెడుతూ... ఆహారం లాక్కుంటూ...
థాయిలాండ్‌లో దండెత్తిన వందల కోతులు... భయపెడుతూ... ఆహారం లాక్కుంటూ... (credit - youtube)
  • Share this:
ప్రపంచ పర్యాటకుల డ్రీమ్ ల్యాండ్‌గా చెప్పుకునే థాయిలాండ్‌పై కరోనా గట్టిగానే కాటు వేసింది. కొన్ని నెలలుగా అక్కడకు పర్యాటకులు రావట్లేదు. టూరిజమే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. అదే లేకపోయేసరికి... ప్రభుత్వం బేలచూపులు చూస్తోంది. ప్రస్తుతం కొత్తగా కరోనా కేసులు వారానికి 20 కంటే తక్కువే నమోదవుతున్నా... పర్యాటకు మాత్రం రావట్లేదు. ఈ సమస్య ఇలా ఉంటే... అక్కడి కోతుల సమస్య మరో రకం. థాయిలాండ్‌లోని లోప్‌పురి పర్యాటక ప్రాంతంలో వేల కొద్దీ కోతులుంటాయి. అక్కడ ఏ మూలకు వెళ్లినా, ఏ ఆలయానికి వెళ్లినా... వందల కొద్దీ కనిపిస్తాయి. టూరిస్టులు కూడా తమతో తెచ్చుకున్న స్నాక్స్ వాటికి పెట్టేవాళ్లు. అలా అవి ఎంతో హాయిగా జీవించేవి.

ఇప్పుడు పరిస్థితి మారింది. కోతులకు ఆకలి వేస్తే... తిండి పెట్టే వారే లేకుండా పోయారు. ఎక్కడో ఒకరూ, ఇద్దరూ అలా జాలి పడి ఏదో ఒకటి పెడుతున్నారు. కానీ వందల కొద్దీ కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుంటే... అవి ఆహారం కోసం ఏకంగా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. షాపులపై పడి దోచుకుంటున్నాయి. స్థానిక ప్రజలను భయపెట్టి మరీ లాక్కుంటున్నాయి. ఏం చేస్తాయి మరి ఆకలి బాధ అలాంటిది కదా.


తాజాగా వందల కొద్దీ కోతులు... రోడ్డుపైకి రావడంతో... ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. అన్ని కోతుల్ని చూసి... బాబోయ్... అవి ఏం చేస్తాయో ఏమో అని ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. వీధులన్నీ టూరిస్టులు లేక ఖాళీగా మారిన వేళ... కోతులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే ఉంటున్నాయి. కార్ల పైకి ఎక్కి... అన్నమో రామచంద్ర అంటున్నాయి.

ఇలాగే ఊరుకుంటే... ఆ కోతులు మరింత తీవ్రంగా మారి... దాడులు చేసి... కరుస్తాయని యానిమల్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ మూగజీవాలు కదా అని టూరిస్టులు ఆహారం పెడితే... ఇప్పుడు కరోనా వాటి పొట్ట కొట్టింది. వాటిని క్రూరంగా మార్చుతోంది. కరోనాతో ఎన్నో రకాల సమస్యలు.. వాటిలో ఇదొకటి.
First published: June 29, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading