హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

జేమ్స్ బాండ్ సినిమాకు కరోనా కష్టాలు.. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రావద్దంటూ..

జేమ్స్ బాండ్ సినిమాకు కరోనా కష్టాలు.. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రావద్దంటూ..

CoronaVirus James Bond Movie postponed | ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

    CoronaVirus James Bond Movie postponed : ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో  25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ సినిమా తెరకెక్కింది. డేనియల్ క్రేగ్  జేమ్స్ బాండ్‌గా నటిస్తోన్న 5వ సినిమా. జనరల్ గా సీక్వెల్స్ అంటే 5 లేదా 6కు మించి తీయడం అసాధ్యం. తీసినా చూడ్డానికి బోర్ కొడుతుంది. అలాంటిది.. జేమ్స్ బాండ్ సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. అంతేనా ఒక కేరెక్టర్ 56 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం అంత ఈజీ కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించాయి జేమ్స్ బాండ్ సినిమాలు.ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు యాక్షన్ ప్రేమికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యారీ జోజి డైరెక్ట్ చేసాడు. తాజాగా ఈ సినిమా విడుదలై కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రభావం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ప్రజలు థియేటర్స్‌కు రావాలంటనే బయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల చేస్తే వచ్చే కలెక్షన్లు రావు. అందుకే కరోనా వైరస్ ప్రభావం తగ్గాకా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. అందుకోసం ఏకంగా ఈ సినిమా విడుదలను ఏడు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ  చిత్రాన్ని నవంబర్ 12 యూకేలో, నవంబర్ 25 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    ఇప్పటికే కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఇటీవలె హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సహా పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ నిలిచిపోయాయి. మరోవైపు పలు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌కు నటీనటులు దూరంగా ఉన్నారు.

    First published:

    Tags: Bollywood, Coronavirus, Hollywood

    ఉత్తమ కథలు