జయహో జనతా రసోయ్....3000 మంది పేదలకు ప్రతిరోజు ఉచిత కిచిడీ భోజనం

ఆకలి బాధలు తీర్చేందుకు "జనతా రసోయ్" పేరిట వ్యాపార వేత్త అంబికా కపూర్ నడుంబిగించింది. తన సంస్థకు చెందిన క్లౌడ్ కిచెన్ సంస్థ ప్రతి రోజు 3000 మంది పేదలకు ఉచితంగా కిచిడీ పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది.

news18-telugu
Updated: March 27, 2020, 9:38 AM IST
జయహో జనతా రసోయ్....3000 మంది పేదలకు ప్రతిరోజు ఉచిత కిచిడీ భోజనం
జనతా రసోయ్
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు, నిర్మాణ రంగం పడకేసింది. ఫలితంగా అసంఘటిత రంగ కార్మికలు రోడ్డున పడ్డారు. అయితే వీరిందరి ఆకలి బాధలు తీర్చేందుకు "జనతా రసోయ్" పేరిట వ్యాపార వేత్త అంబికా కపూర్ నడుంబిగించింది. తన సంస్థకు చెందిన క్లౌడ్ కిచెన్ సంస్థ ప్రతి రోజు 3000 మంది పేదలకు ఉచితంగా కిచిడీ పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. వీరందరికీ శుభ్రమైన వాతావరణంలో కిచిడీ సప్లై చేయనున్నారు. ఇప్పటి వరకూ కేవలం 300 మందికే భోజన ఏర్పాట్లు చేసే ఈ క్లౌడ్ కిచెన్ సామర్థ్యాన్ని పెంచి కిచిడీ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 3000 మందికి అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో కిచిడీ తయారు చేసి పేదలకు ప్యాక్ చేసి అందిస్తున్నారు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు