హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణ వ్యక్తికి రూ.1.52 కోట్ల కరోనా బిల్లు.. ఆస్పత్రి ఉదారతతో ఇంటికి..

తెలంగాణ వ్యక్తికి రూ.1.52 కోట్ల కరోనా బిల్లు.. ఆస్పత్రి ఉదారతతో ఇంటికి..

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమైంది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమైంది.

కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 23న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు జాయన్ అయ్యారు. ఆసుపత్రిలో చేరిన రాజేశ్ 80 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు.

  బతుకుదెరువు కోసం ఓ జగిత్యాల బిడ్డ దుబాయ్ వలసపోయాడు. కానీ అక్కడ కరోనా మహమ్మారి సోకడంతో 80 రోజులు ఆస్పత్రికి పరిమితమయ్యాడు. తీరా కరోనా తగ్గి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిదామంటే.. ఆస్పత్రి యాజమాన్యం వేసిన బిల్లు చూసి గుండె ఆగినంత పని అయ్యింది. ఒకట్రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.1.52 కోట్ల బిల్లు చూసి పైప్రాణం పైకే పోయినంత పనయ్యింది. తీరా ఇండియన్ ఎంబసీని కలవడం.. ఆస్పత్రికి ఎంబసీ లేఖరాయడంతో బతుకు జీవుడా అంటూ ఇంటిబాట పట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల గొల్లపల్లి మండలం ఓడ్నాలకు చెందిన రాజేశ్(42) దుబాయ్‌కు బతుకుదెరువు కోసం వెళ్లాడు. అక్కడ కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 23న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు జాయన్ అయ్యారు.

  ఆసుపత్రిలో చేరిన రాజేశ్ 80 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇందుకు ఆసుపత్రి దుబాయ్ కరెన్సీ ఏఈడీ 762,555.24 దిరాముల బిల్లు వేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,56,26,983.92 అవుతోంది. ఈ డబ్బును చెల్లించలేకపో రాజేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంతపెద్ద మొత్తంలో తాను డబ్బు చెల్లించలేనని చెప్పి ఇండియన్ ఎంబసీని ఆశ్రయించాడు. ఎంబసీ అధికారులు మానవత్వంతో రాజేశ్‌కు వేసిన బిల్లును మినహాయించాలని కోరుతూ లేఖ రాసింది. దీంతో స్పందించిన యాజమాన్యం రాజేశ్ బిల్లను మాఫీ చేయడంతో పాటు అతడికి ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసింది.

  అంతటితో ఆగకుండా ఫైఖర్చుల కోసం రూ.10వేలు జేబులో పెట్టి మరీ ఇండియాకు పంపించింది. దీంతో బుధవారం రాజేశ్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా రాజేశ్ ఈ నెల 14న వచ్చిన 47 మంది జగిత్యాల వాసులతో స్వస్థలానికి చేరాల్సి ఉన్నప్పటికీ ఆయన అక్కడి ఆసుపత్రిలో బిల్లు చెల్లించకపోవడంతో రాలేకపోయాడు. ఎంబసీ చొరవతో దుబాయ్ ఆస్పత్రి చూపిన ఉదారత పట్ల రాజేశ్ ధన్యవాదాలు తెలిపారు.

  Published by:Anil
  First published:

  Tags: Corona virus, Dubai

  ఉత్తమ కథలు