అనవసరంగా బయటకు వస్తే డ్రోన్ కెమెరాలు పట్టేస్తున్నాయి...

అనవసరంగా బయటకు వస్తే డ్రోన్ కెమెరాలు పట్టేస్తున్నాయి...

డ్రోన్ కెమెరాల నిఘాలో వీధుల్లోకి వచ్చిన వారిని గుర్తించడం, ఆ ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకోవడం లాంటి దృశ్యాలను ఈ డ్రోన్ కెమెరాలు పట్టేస్తున్నాయి.

 • Share this:
  కరీంనగర్ జిల్లా : లాక్ డౌన్ అమలులో భాగంగా నిర్ణీత సమయాల్లో మినహా ఎక్కడ ఎవరైనా అనవసరంగా బయటకు వచ్చినా, గుమి గూడిన కమిషనరేట్ వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలు వారి కదలికలను గుర్తిస్తున్నాయి. సత్వరమే ఆయా ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా పోలీస్ స్టేషన్లకు తరలించే పక్రియ కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్ డౌన్, కర్ఫ్యూ లను ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు సఫలీకృతం అవుతున్నారు.
  అమలులో ఉన్న నిబంధనలు ఉల్లంఘించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై పోలీసులు కేసులను నమోదు చేస్తున్నారు. శుక్రవారం నాడు కమిషనరేట్ వ్యాప్తంగా చేపట్టిన డ్రోన్ కెమెరాల నిఘాలో వీధుల్లోకి వచ్చిన వారిని గుర్తించడం, ఆ ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకోవడం లాంటి దృశ్యాలను ఈ డ్రోన్ కెమెరాలు పట్టేస్తున్నాయి.

  పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తీసుకుంటున్న చర్యలు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు.
  కట్టుదిట్టంగా అమలు చేస్తున్న చర్యలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదైతే వారికి భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక పోవడంతో పాటు పాస్ పోర్టులు కూడా మంజూరు కావని కమిషనర్ హెచ్చరించారు.
  Published by:Venu Gopal
  First published: