ఆటో డ్రైవర్‌కు కలిసొచ్చిన ‘కరోనా కాలం’...

ప్రతీకాత్మక చిత్రం

ఇది కలికాలమే. కరోనా వైరస్ కాలం కూడా. అందుకే పోయిన డబ్బులు దొరికాయి. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే దొరికాయి.

  • Share this:
    ఇది కలికాలమే. కరోనా వైరస్ కాలం కూడా. అందుకే పోయిన డబ్బులు దొరికాయి. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే దొరికాయి. దీంతో ఆ ఆటో డ్రైవర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గతంలో రోడ్డు మీద రూ.10 పడితే కళ్లు మూసి తెరిచే సమయంలోనే అవి మాయం అయిపోయేవి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రోడ్డు మీద పడిపోయిన డబ్బులు అలాగే దొరికాయి. బీహార్‌లో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని సహర్ష జిల్లాలో కోపా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తన ఇంటి మీద రేకుల షెడ్ వేసుకోవడానికి ఎంతోకాలంగా దాచిపెట్టిన రూ.25000 తీసుకుని బయటకు వెళ్లాడు. లాక్ డౌన్ తర్వాత భవన నిర్మాణ పనిముట్లు లభిస్తున్నాయి కాబట్టి, వాటిని కొనుక్కోవడానికి వెళ్లాడు. ఆటోలో కొంతదూరం వెళ్లిన తర్వాత తన దగ్గర ఉండాల్సిన డబ్బులు కనిపించలేదు.

    ఇంట్లో మర్చిపోయానా? లేకపోతే దారిలో పడిపోయాయా? అని అనుమానం వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఇంట్లో డబ్బులు పెట్టానేమో చూడమని చెప్పాడు. వారు లేదని సమాధానం ఇచ్చారు. దారిలోనే పడిపోయి ఉంటాయని గమనించి వెంటనే ఆటోను వెనక్కు తిప్పి రోడ్డు మీద చూసుకుంటూ వస్తున్నాడు. డబ్బులు దొరుకుతాయా? రోడ్డు మీద పడిన డబ్బులు ఎవరైనా వదిలి పెడతారా? అంటూ ఆందోళనతో వస్తున్న సమయంలో అతడి డబ్బుల కట్ట రోడ్డు మీద అలాగే పడిపోయి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో రోడ్డు మీద పడిన డబ్బులు తీసుకోవడానికి కూడా జనం భయపడుతున్నారు. వాటికి కరోనా వైరస్ అంటించి పడేస్తున్నారేమో అనే భయంతో డబ్బులను పట్టుకోవడం లేదు. అందువల్లే రోడ్డు మీద పడిన డబ్బులు పడినట్టే ఉన్నాయని అతడు గ్రహించాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: