కరోనా మహమ్మారిని అలా తరిమికొట్టండి..కర్ణాటక కాంగ్రెస్ నేత వింత చిట్కా

కర్ణాటకలోని మంగళూరులోని ఉల్లాల్ సీఎంసీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రవిచంద్రగట్టి కరోనా వైరస్ నియంత్రించేందుకు ఓ ఇంటి చిట్కాను చెబుతూ వీడియో రూపొందించారు.

news18-telugu
Updated: July 18, 2020, 11:45 AM IST
కరోనా మహమ్మారిని అలా తరిమికొట్టండి..కర్ణాటక కాంగ్రెస్ నేత వింత చిట్కా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా నియంత్రణకు ఖచ్చితమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంటి చిట్కాలు పాటిస్తే కరోనా వైరస్ దరి చేరదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు తమ చిట్కాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ చిట్కాలు, చికిత్సలను వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోలేదు. అయితే ఓ కాంగ్రెస్ నాయకుడు సూచించిన ఓ విచిత్రమైన ఇంటి చిట్కా వింటే.. షాకవుతారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే.. రమ్ తాగండి.. ఫ్రై చేసిన గుడ్లు తినండంటూ ఓ వీడియోనూ రూపొందించారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మంగళూరులోని ఉల్లాల్ సీఎంసీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రవిచంద్రగట్టి కరోనా వైరస్ నియంత్రించేందుకు ఓ ఇంటి చిట్కాను చెబుతూ వీడియో రూపొందించారు.ఆ వీడియోలో 90 ఎంఎల్ రమ్ములో టీ స్పూన్ మిరియాల పొడిని కలుకుని తాగండి. ఆ తర్వాత రెండు ఆఫ్ బాయిల్డ్ కోడి గుడ్డును తినండి. అంతే మీకు కరోనా దరిచేరదు. నేను ఇంతకుమందు చాలా మందులు ప్రయత్నించాను. కానీ ఏదీ పనిచేయలేదు. అయితే నేను దీన్ని ఒక రాజకీయ నాయకుడిగా సూచించడం లేదంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి రవిచంద్ర ఒక కాంగ్రెస్ నేతగానే కాక, సామాజిక కార్యకర్తగాను పనిచేస్తున్నాడు.

అయితే సదరు వీడియోను సోషల్ మీడియాలో రవిచంద్ర గట్టి ఎందుకు పంచుకున్నారనే విషయాన్ని జిల్లా యంత్రాంగం తెలుసుకోవాలంటూ మంగళూరు ఎమ్మెల్యే యూటీ ఖాదర్ పేర్కొన్నారు. రవిచంద్ర గట్టి 15 ఏళ్లుగా సామాజిక కార్యకర్తగాను పనిచేశారు. ఈ వ్యవహారంపై పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానమని తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 18, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading