SAMPARC App : కరోనా పేషెంట్లపై నిఘా... కొత్త యాప్ తెచ్చిన DRDO...

SAMPARC App : ఆస్పత్రుల్లో ఉన్న రోగులు ఎలాగూ అక్కడే ఉంటారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు ఎక్కడికీ వెళ్లకుండా ఉండేందుకు సరికొత్త యాప్ తెచ్చింది DRDO.

news18-telugu
Updated: July 14, 2020, 8:37 AM IST
SAMPARC App : కరోనా పేషెంట్లపై నిఘా... కొత్త యాప్ తెచ్చిన DRDO...
కరోనా పేషెంట్లపై నిఘా... కొత్త యాప్ తెచ్చిన DRDO... (credit - twitter)
  • Share this:
కేంద్ర రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)... కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక యాప్ తెచ్చింది. దీన్ని స్మార్ట్ ఆటోమేటెడ మేనేజ్‌మెంట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ రిస్క్స్ ఫర్ కొవిడ్-19 అని అంటున్నారు. ఇంత పెద్ద పేరు మనకు గుర్తుండదు కాబట్టి సింపుల్‌గా దీన్ని సంపర్స్ (SAMPARC) యాప్ అంటున్నారు. దీన్ని ఎందుకు చేసిందంటే... హోంక్వారంటైన్ లేదా ఐసోలేషన్‌లో ఉండాల్సిన చాలా మంది కరోనా పేషెంట్లు... మాట వినట్లేదు. ఇళ్లలోంచి బయటకు వచ్చి ఫ్రీగా తిరుగుతున్నారు. తమకు కరోనా ఉన్న విషయాన్ని దాచి పెట్టి... షాపులకు వెళ్లి సామాన్లు తెచ్చుకుంటున్నారు. అందువల్ల మరింత మందికి కరోనా సోకుతోంది. అందుకే... అలాంటి వారిని ఇంట్లోంచీ బయటకు రాకుండా నిఘా పెట్టేందుకు పోలీసులు కోరినట్లుగా DRDO ఈ యాప్‌ని తయారుచేసింది. దీని ద్వారా హోం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్నవారు... నిరంతరం ఎక్కడున్నదీ తెలుస్తుంది. DRDOకి చెందిన సెంటర్‌ ఫర్‌ ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ డిపార్ట్‌మెంట్ దీన్ని డెవలప్ చేసింది.

సంపర్క్ యాప్‌లో జియోఫెన్సింగ్‌, ఫేస్‌ రికగ్నిషన్‌, మ్యాప్‌ ఉంటాయి. అవి ఏయే పేషెంట్లు ఎక్కడున్నదీ చూపిస్తాయి. వారిని పోలీసులు, డాక్టర్లు గమనిస్తూ ఉంటారు. ఆ పేషెంట్లు... అక్కడి నుంచి కదిలి ఎటైనా వెళ్తే... వెంటనే ఈ యాప్ గుర్తిస్తుంది. ఇందుకోసం ఆ వ్యక్తి పేరు, మొబైల్ నంబరు, ఫోన్‌ IMEI నంబరు, క్వారంటైన్‌ ప్రాంతం, క్వారంటైన్‌ కాలపరిమితి, ఈమెయిల్‌ ఐడీ, ఫొటో వంటివి ఇవ్వాలి. యాప్‌ని తన స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 10 నిమిషాలకోసారి కోవిడ్‌ సర్వర్‌కు అలర్ట్‌ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. కరోనా పేషెంట్... జియో ఫెన్సింగ్ ప్రదేశాన్ని నాలుగుసార్లు దాటితే... ఆ వ్యక్తి మొబైల్‌కి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. తద్వారా పేషెంట్... బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. క్వారంటైన్ టైమ్ ముగిసేవరకూ ఈ నిఘా ఉంటుంది. క్వారంటైన్ ముగిశాక... అప్పుడు యాప్ డిలీట్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ముందుగా తెలంగాణలోని ఏదైనా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. అంతా బాగానే ఉన్నా ఓ సమస్య ఉంది. ఇళ్లలోంచి బయటకు వెళ్లేవారు... మొబైల్ ఇంట్లోనే వదిలేసి వెళ్తే... ఈ యాప్ గుర్తించగలదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading