COVID-19 Detect: అరిస్తే చాలు కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది.. సరికొత్త పరికరం

COVID-19 Detect: అరిస్తే చాలు కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది.. సరికొత్త పరికరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం, ముక్కు లేదా నోటి ద్వారా గొంతులోకి స్వాబ్ చేర్చి శాంపిల్ తీస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఇలాగే COVID పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో తీసిన నమూనాలను వైరస్ కోసం పరీక్షిస్తారు. అయితే, ఈ ప్రక్రియ చాలా చికాకు కలిగిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ తిప్పలు తప్పనున్నాయి.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా మనుషుల జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పొరపాటున తుమ్మినా, దగ్గినా కరోనా వైరస్​ సొకిందేమోనన్న భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి. అయితే, కరోనా కట్టడికి నిర్థారణ చాలా కీలకం. కరోనా సోకిందో లేదో తెలిస్తేనే.. అది ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడొచ్చు. మరి అటువంటి కీలకమైన నిర్ణారణ కొరకు కరోనా పరీక్ష చేయించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతం, ముక్కు లేదా నోటి ద్వారా గొంతులోకి స్వాబ్ చేర్చి శాంపిల్ తీస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఇలాగే COVID పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో తీసిన నమూనాలను వైరస్ కోసం పరీక్షిస్తారు. అయితే, ఈ ప్రక్రియ చాలా చికాకు కలిగిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ తిప్పలు తప్పనున్నాయి. ఎందుకంటే, నూతన టెక్నాలజీ సహాయంతో కరోనా టెస్ట్​కు ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు డచ్ శాస్త్రవేత్తలు. వాన్​ వీస్ అనే శాస్త్రవేత్త ఎయిర్​ లాక్​ టెక్నాలజీ సహాయంతో​ ఈ కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం ముందు బిగ్గరగా అవడం లేదా పాడటం ద్వారా కరోనాను నిర్ధారించుకోవచ్చని చెబుతున్నారు. మనం బిగ్గరగా అరిచే సమయంలో బయటకు వచ్చే బిందువులను ఆ పరికరం పరీక్షించి కరోనా ఉందా? లేదా? అనే విషయాన్ని క్షణాల్లో తెలియజేస్తుంది.

అరవడం ద్వారా విడుదలైన బిందువులతో..
డచ్ ఆవిష్కర్త వాన్ వీస్ కనిపెట్టిన ఈ పరికరం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి COVID-19 టెస్టింగ్ డివైజ్​ ముందుకు వచ్చి బిగ్గరగా అరవాలి.. అప్పుడు మన తుంపర్లు ఎయిర్​ లాక్​ టెక్నాలజీతో క్యాబిన్​లో లాక్​ అవుతాయి. తద్వరా, నానోమీటర్-స్కేల్ సైజింగ్ పరికరం మన తుపంర బిందువులలోని వైరస్​ను గుర్తిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాగా, ఈ నూతన పరికరంపై వాన్ వీస్ మాట్లాడుతూ, “కరోనా నిర్థారణకు ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతితో ఫలితం రావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాక, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్లే, ఈ కొత్త పరికరాన్ని కనుగొన్నాం. తద్వారా, ఒక వ్యక్తి కేవలం అరవడం లేదా మాట్లాడటం ద్వారానే కరోనా వైరస్ నిర్థారణ చేసుకోవచ్చు.” అని అన్నారు. కాగా, ఈ పరికరం అద్భుతమైన ఫలితాలను ఇస్తుండటంతో దీన్ని స్పెయిన్​లోని విమానాశ్రయాలు, పాఠశాలలు, కార్యాలయాలు, జనాలు గుమికూడే ప్రదేశాల్లో వాడాలని యోచిస్తున్నారు. తద్వారా, తక్కువ వ్యవధిలోనే సులభంగా కరోనా నిర్థారణ చేయవచ్చు. దీంతో, కరోనా పాజిటివ్ వ్యక్తిని ఎంట్రన్స్​ దగ్గరే గుర్తించవచ్చు. తద్వారా అతడి నుంచి ఇతరులకు సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. దీనిపై నెదర్లాండ్స్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ హెల్త్ ప్రతినిధి గీర్ట్ వెస్టర్హుయిస్ మాట్లాడుతూ ‘‘వేగవంతమైన, కచ్చితమైన కరోనా నిర్థారణ ఫలితాన్నిచ్చే పద్ధతుల కోసం మా సంస్థ అన్వేషిస్తోంది. అయితే, వాన్​ వీస్ నూతనంగా ఆవిష్కరించిన కరోనా నిర్థారణ పరికరం ఎలా పనిచేస్తుందనే విషయంపై పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.” అని అభిప్రాయపడ్డారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: