Donald Trump Covid update: డొనాల్డ్ ట్రంప్‌కు శ్వాస సమస్య..కరోనాకు ఆస్పత్రిలో చికిత్స

Donald Trump Covid Update: కరోనా లక్షణాలతో బాధపడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా కూడా అమెరికాలోని మిలిటరీ ఆస్పత్రిలో చేరారు.

news18
Updated: October 3, 2020, 10:43 AM IST
Donald Trump Covid update: డొనాల్డ్ ట్రంప్‌కు శ్వాస సమస్య..కరోనాకు ఆస్పత్రిలో చికిత్స
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 3, 2020, 10:43 AM IST
  • Share this:
కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థతిపై వస్తున్న రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వచ్చిన 17 గంటల తర్వాత ఆయన పూర్తిగా వైద్యుల సమక్షంలోకి వెళ్లి చికిత్స తీసుకుంటుండగా.. తాజాగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం.. ట్రంప్ సలహాదారులలో ఒకరిగా ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడానికి కారణాలున్నాయని ఆయన చెప్పడం గమనార్హం. ట్రంప్ చాలా అలసటతో, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని సీఎన్ఎన్ కథనాన్ని ప్రచారం చేసింది.

కాగా.. కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలలో ఆయనకు కరోనా రావడం గమనార్హం. బుధవారం ఆయన సలహాదారుడు హోప్ హిక్స్ కు కరోనా వచ్చిన వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది.. ట్రంప్ తో పాటు ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించగా.. వారిరువురికి పాజిటివ్ గా తేలింది. దీంతో వారిరువురు క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

ట్రంప్ వయస్సు దృష్ట్యా చూసుకున్నా.. ఈ వయసులో ఆయనకు కరోనా సోకడం ప్రమాదకరమేనని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్వల్పంగా జ్వరంతో ఆయన బాధపడుతున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడికి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు రావడం ఆందోళన కలిగించే అంశం. కాగా, వైట్ హౌస్ డాక్టర్లు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ఇందుకోసం ట్రంప్ ఆరోగ్య వ్యవహారాలు చూసే డాక్టర్ సేన్ పి. కోన్లే.. ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు అమెరికాలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఔషధాన్ని ఆయనకు ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయమై కోన్లే స్పందిస్తూ.. ‘ట్రంప్ కు రెజెనెరన్ (ఆర్ఈజీఎన్.0, ఆర్ఈజీఎన్-సీవోవీ2) లను ఇస్తున్నాం. ఈ డ్రగ్ కరోనా వ్యాక్సిన్ కోసం తయారుచేస్తున్న దాంట్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. దీని ద్వారా మనుషుల్లో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి..’ అని తెలిపారు. ఇదొక్కటే గాక ఆయనకు జింక్, విటమిన్ డి, ఫమోటైడైన్, అస్పిరిన్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు ట్రంప్ దంపతులకు కరోనా అని తేలడంతో వాల్ స్ట్రీట్ వీధులన్నీ నిన్న వెలవెలబోయాయయి. సమయానికంటే ముందే దానిని మూసేశారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పడిపోయాయి. అమెరికాలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే అవకాశముందన్న ఊహాగానాలతో ఆయిల్ ధరలు మరింత క్షీణించాయి.
Published by: Srinivas Munigala
First published: October 3, 2020, 10:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading