హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Donald Trump Corona: ట్రంప్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి

Donald Trump Corona: ట్రంప్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

Donald Trump Corona: ట్రంప్‌ కుమారుడు బారన్ కు సైతం కరోనా సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. మెలానియా ట్రంప్‌ బుధవారం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు.

ఇంకా చదవండి ...

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ ఆ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన భార్య మొలానియాకు సైతం పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే

ట్రంప్‌ కుమారుడు బారన్ కు సైతం కరోనా సోకిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మెలానియా ట్రంప్‌ బుధవారం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. మెలానియా ట్రంప్‌ తనకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే అమెరికా ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి చేపడతానని తెలిపారు.

తమ కుటుంబంలో ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందంగా ఉందని మొలానియా అన్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఒకరినొకరు చూసుకుంటున్నామన్నారు. కలిసి సమయం గడుపుతున్నామన్నారు. తమ కుమారుడు బారన్ టీనేజర్ కావడంతో అతనిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పారు. ఈ నెల 2న ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మూడు రోజుల పాటు ట్రంప్ సైనిక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం వైట్‌హౌస్‌లో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వారు కరోనా నుంచి కోలుకున్నారు.

ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ తన కుమారుడికి కరోనా సోకిన విషయం గురించి మీడియాతో మాట్లాడారు. తన చిన్న కుమారికి కరోనా సోకిందని చెప్పారు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగుందని చెప్పారు. వైరస్ లక్షణాలు తనలో చాలా స్వల్ప కాలం కనిపించాయన్నారు. బారన్ కు రోగ నిరోధన శక్తి బలంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. బహుశా అతడికి ఈ వైరస్ సోకన విషయం కూడా తెలిసి ఉండదన్నారు.

First published:

Tags: America, Corona, Donald trump

ఉత్తమ కథలు