Donald Trump: వైట్ హౌస్ కు ట్రంప్.. మాస్కులేకుండానే కార్యకలాపాలు

Donald Trump: వైట్ హౌస్ కు ట్రంప్.. మాస్కులేకుండానే కార్యకలాపాలు

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

Donald trump Came to white house: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాస్పిటల్ నుంచి డిశ్చార్చి అయ్యారు. కోవిడ్ ఇంకా పూర్తిగా నయం కాకున్నా.. వైట్ హౌస్ కు రావడం గమనార్హం.

 • News18
 • Last Updated:
 • Share this:
  నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడి అమెరికాలోని వాల్టర్ రీడ్ సైనికాస్పత్రిలో చికిత్స పొందిన అక్కడి నుంచి డిశ్చార్జి అయ్యారు. హాస్పిటల్ నుంచి నేరుగా వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్.. అక్కడ్నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు అక్కడ్నుంచే వైద్యం అందించనున్నట్టు వైట్ హౌస్ డాక్టర్లు చెబుతున్నారు. ఐదు రోజుల కింద ట్రంప్ సలహాదారుడు హిప్ హోక్స్ ద్వారా ఆయనకు, ట్రంప్ భార్య మెలానియమా ట్రంప్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

  కాగా, ఆస్పత్రి నుంచి శ్వేతసౌధం చేరుకున్న ట్రంప్.. ఇంకా పూర్తిగా కోలుకోకున్నా.. ముఖానికి మాస్కును ధరించలేదు. వైట్ హౌస్ కు చేరుకున్న ఆయన.. తాను ఉండే గదికి ఎప్పటిలా ఎలివేటర్ లా వెళ్లకుండా.. మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్నారు. అక్కడినుంచే విలేకరులకు, తన మద్దతుదారులకు అభివాదం చేశారు. అప్పటిదాకా మాస్కు పెట్టుకుని కనిపించిన ఆయన ఒక్కసారిగా మాస్కును తొలగించారు. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ లో తన ఆరోగ్యం గురించి ఒక పోస్టు విడుదల చేశారు.  అందులో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. బహుశా నేను రోగ నిరోధక శక్తిని కలిగిఉన్నానని అనుకుంటున్నాను. కోవిడ్ కు ఎవరూ భయపడొద్దు.. దానిని (కరోనా) మన జీవితాలపై ఆధిపత్యం చలాయించేలా చూడకూడదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వీడియో విడుదల చేశారు. ఇక ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని వైట్ హౌస్ నుంచే పర్యవేక్షిస్తామని ఆయన వైద్య బృందంలో కీలకంగా ఉన్న డాక్టర్ సీయోన్ క్లానే తెలిపారు. గడిచిన మూడు రోజులుగా ఆయనలో జ్వరం వచ్చిన లక్షణాలు ఏమీ కనిపించట్లేదనీ, మిలిటరీ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి కావడానికి ట్రంప్ కు అన్ని అర్హతలున్నాయని ఆయన మీడియాకు వెల్లడించారు. సోమవారం ఆయనకు మరోసారి రెమిడెసిఫిర్ అందించినట్టు వివరించారు. ట్రంప్ ఆక్సిజన్ లెవల్స్ మెరుగయ్యాయని క్లానే తెలిపారు.

  ఇక కరోనాను జయించిన తాను త్వరలోనే అమెరికా ప్రచార కార్యక్రమాలలోనూ పాల్గొంటానని ట్రంప్ తెలిపారు. అందుకోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 15 న మియామిలో తన ప్రత్యర్థి జో బైడెన్ తో జరగనున్న డిబేట్ లో తాను పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయ ముఖచిత్రం రానురాను ట్రంప్ కు వ్యతిరేకంగా మారుతున్నది. ఇటీవలే జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ కన్నా బైడెనే ఎక్కువ పాయింట్లు సాధించాడని వార్తలు వస్తుండటం ప్రస్తుత అధ్యక్షుడికి ఆందోళన కలిగిస్తున్నది.
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు