హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Donald Trump: వైట్‌హౌస్‌లో కరోనా కలకలం.. ట్రంప్ దంపతులకు పరీక్షలు

Donald Trump: వైట్‌హౌస్‌లో కరోనా కలకలం.. ట్రంప్ దంపతులకు పరీక్షలు

డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

హోప్ హిక్స్.. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు.

అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేగింది. డొనాల్ట్ ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వారిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటారు హోప్ హిక్స్. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాదు ఇటీవల ఓహియోలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రామానికి కూడా ట్రంప్‌తో కలిసి వెళ్లారు హోప్ హిక్స్. ఆమె దగ్గరగా మెలగడంతో ట్రంప్ దంపతులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

చిన్న విరామం కూడా లేకుండా అధ్యక్ష ఎన్నికల కోసం పనిచేస్తున్న హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇది భయానకం. ప్రథమ పౌరురాలు, నేను కరోనా పరీక్షల ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఆ లోపు హోం క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించాం. అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.


కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 74,94,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 47,36,621 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో కరోనా బారినపడి 2,12,660 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25,45,390 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 14,190 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఐతే అధ్యక్షుడు ట్రంప్ హోంక్వారంటైన్‌కు వెళ్లడంతో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం పడనుంది.

First published:

Tags: America, Coronavirus, Covid-19, Donald trump

ఉత్తమ కథలు