ఒంగోలులో కరోనా రోగి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం వెలుగు చూసింది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి.

  • Share this:
    ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం వెలుగు చూసింది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఒంగోలు లో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా బిట్రగుంటకు చెందిన కాంతారావు రిటైర్డ్ వీఆర్‌ఏ. కొన్ని రోజుల క్రితం గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయనకు కరోనా సోకినట్టు రిపోర్టు వచ్చింది. అయితే, తాను హోం ఐసోలేషన్‌లోనే ఉంటానని చెప్పాడు. కానీ, స్థానిక ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఒప్పుకోలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఒంగోలు రిమ్స్‌కు క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని చెప్పడంతో అన్యమనస్కంగానే ఆంబులెన్స్ ఎక్కాడు. అయితే, ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబసభ్యులు సదరు సిబ్బందిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. అందుకు ఆ సిబ్బంది ‘మేం డాక్టర్లతో మాట్లాడుతున్నాం. బాగానే ఉన్నాడు.’ అంటూ చెబుతూ వచ్చారు. కానీ, సడన్‌లో ఒంగోలు రిమ్స్‌లో కాంతారావు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న వీడియో బయటకు వచ్చింది. అతడు కాంతారావు అని తెలిసిన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కనీసం మనిషి చనిపోయినా కూడా తమకు సమాచారం ఇవ్వలేదని, ‘చూస్తున్నాం. చేస్తున్నాం. బాగానే ఉన్నాడు.’ అంటూ మభ్య పెట్టారని మండిపడ్డారు. ఈఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.    ఇత్తడి కాంతారావు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ఒంగోలు రిమ్స్ వైద్యులు నిర్లక్ష్యమే కారణమన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: