కరోనా (Corona) రోజు రోజుకు కొత్త రూపంలో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇప్పటి వరకు డెల్టా వేరియంట్ కారణంగా జనం ఇబ్బంది.. ఆందోళన చెందారు. ఇది కాక తాజాగా మరో వేరియంట్ బయటపడింది. అదే ఏవై.4 వేరియంట్ (AY-4 Varient). ఈ వేరియంట్ మధ్య ప్రదేవ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో బయటపడింది. కోవిడ్ టీకా పూర్తి డోస్ తీసుకొన్నప్పటికీ ఈ వేరియంట్ బారిన పడడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ(https://telugu.news18.com/tag/delhi/news/)లోని జాతీయ అం టువ్యా ధుల నియంత్రణ కేంద్రం (NCDC) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, ఆరుగురు వ్య క్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్ష ల కోసం వైద్యులు సెప్టెంబరులో ఢిల్లీకి పంపారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుం చి దేశం లో ఏవై.4 రకం కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.
రెండు టీకాలు తీసుకొన్నా..
బాధితులంతా కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారే. చికిత్స తర్వా త వారం తాకోలుకున్నా రు’ అని పేర్కొన్నారు. ఈ ఆరుగురు వ్య క్తులతో సన్ని హితంగా ఉన్న మరో 50 మం దికి కూడా పరీక్షలు నిర్వ హిం చగా వారం తా ఆరోగ్యం గా ఉన్న ట్లు తేలిం దని వైద్యా ధికారి వెల్లడిం చారు.
Saudi Crown : నాటి రాజును విషపు ఉంగరంతో చంపాలనుకొన్నారు.. సౌదీ రాజుపై సంచలన ఆరోపణ
ఏవై.4 ఓ కొత్త రకం వేరియం ట్ అని.. దీనికి సం బం ధిం చిన సమాచారం ఎక్కు వగా లేదని ఇం డోర్లోని మైక్రోబయాలజీ విభాగానికి చెం దిన అధికారి డాక్టర్ అనితా మూతా పేర్కొ న్నా రు.
కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination)లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఇవాళ్టి ఉదయ నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు వేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
మన దేశంలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. మొదటి దశలో కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ప్రారంభమయింది. రెండో దశలో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించారు. అనంతరం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రారంభమైన మొదటి రోజుల్లో కొన్ని రకాల భయాలు, అపోహలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగింది. కానీ రెండో దశ కరోనా విజృంభించిన తర్వాత వ్యాక్సినేషన్ ఊపందుకుంది. జూన్ నెలాఖరులో రోజుకు 40 లక్షల టీకాలు వేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా 2.50 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా 9 నెలల్లోనే 100 కోట్ల డోస్‌ల మార్క్‌ను అధిగమించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid -19 pandemic