కరోనా వార్డులో ప్రభుదేవా పాటకు డాక్టర్ స్టెప్పులు.. వీడియో వైరల్..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

news18-telugu
Updated: September 3, 2020, 11:27 AM IST
కరోనా వార్డులో ప్రభుదేవా పాటకు డాక్టర్ స్టెప్పులు.. వీడియో వైరల్..
కరోనా వార్డులో ప్రభుదేవా పాటకు డాక్టర్ స్టెప్పులు.. వీడియో వైరల్..
  • Share this:
కరోనా వార్డులో ఓ డాక్టర్ డాన్స్ చేశాడు. పీపీఈ కిట్‌లోనే అద్దిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నాడు.  ముక్కాలా ముక్కాబులా పాటకు ప్రభు దేవాను మరిపించేలా డ్యాన్స్ ఇరగదీశాడు. కేరళలోని కాసర్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. కాసర్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలో కొందరు మానిసిక రోగులు కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు. కరోనా సోకినప్పటి నుంచి వారంతా మూడీగా ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా.. ఏదో జరిగిపోతోందన్న ఆందోళనతో కనిపించారు. వారిలో ఉత్సాహం నింపేందుకు డాక్టర్ శ్రీజిత్ కరోనా వార్డులో డాన్స్‌ చేశారు.  అద్దిరేటి స్టెప్పులేస్తూనే.. మధ్యమధ్యలో ఫన్నీ మూమెంట్స్ చేశాడు. డాక్టర్ డాన్స్‌ను మానసిక రోగులు ఎంజాయ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రోగులకు కేవలం ట్రీట్‌మెంట్ మాత్రమే.. వారిలో ఉత్సాహం కూడా నింపుతున్నారని మెచ్చుకుంటున్నారు. రోగులకు ఇలాంటి వైద్యులే కావాలని అభిప్రాయపడుతున్నారు. కాగా, కేరళలో ఇప్పటి వరకు 78,072 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి ఇప్పటి వరకు 55,778 మంది కోలుకున్నారు. మరో 305 మరణించారు. ప్రస్తుతం కేరళలో 21,923 యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 3, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading