Sanitizer: మీరు వాడుతున్న శానిటైజర్ ఒరిజనలేనా?.. సింపుల్ గా ఇలా టెస్ట్ చేయండి..

Sanitizer: కరోనా నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్ పెరుగుతున్నా కొద్దీ మార్కెట్లో కొందరు ఫేక్ శానిటైజర్లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఈ సింపుల్ పరీక్షలతో మీ శానిటైజర్లు ఒరిజనలా? కాదా? అని తెలుసుకోండి.

news18-telugu
Updated: October 28, 2020, 11:44 AM IST
Sanitizer: మీరు వాడుతున్న శానిటైజర్ ఒరిజనలేనా?.. సింపుల్ గా ఇలా టెస్ట్ చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి ప్రభావంతో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు వాడకం మన జీవితంలో భాగమైంది. నీరు, సబ్బు అందుబాటులో లేనప్పుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్ నే అనేక మంది ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలు చేసిన సమయంలోనూ శానిటైజర్ ను వెంట తీసుకెళ్తున్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఈ హ్యాండ్ శానిటైజర్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. అయితే వీటికి పెరుగుతున్న డిమాండ్ కొద్దీ మార్కెట్లో కొందరు ఫేక్ శానిటైజర్లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇలా నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్నారు. ఇలాంటి శానిటైజర్లను వాడే వారు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వీటిని వాడడం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ నేపథ్యంలో శానిటైజర్ నాణ్యతను తెలుసుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలు ఇవే..

టిష్యూ పేపర్ టెస్ట్..

టిష్యూ పేపర్ ను తీసుకొని దానిపై బాల్ పాయింట్ పెన్నుతో ఓ వృత్తం గీయండి. అనంతరం ఈ కాగితాన్ని చదునైన ఉపరితలంపై ఉంచండి. శానిటైజర్ తీసుకుని టిష్యూ పేపర్ పై ఉన్న వృత్తంలో కొన్ని చుక్కలను పోయండి. ఇప్పుడు వృత్తం నుంచి బయటవెళ్లే వరకు శానిటైజర్ వ్యాప్తి చెందేవరకు వేచి ఉండండి. జెల్ హ్యాండ్ శానిటైజర్ వ్యాప్తి చెందడానికి సమయం పడుతుంది. ద్రవ రూపంలో ఉన్న శానిటైజర్లో తగినంత ఆల్కహాల్ ఉండి, ప్రభావావంతంగా పనిచేస్తుంటే మీరు గీసిన గీత దానిలో కరిగిపోతుంది. రంగు విస్తరించడం ప్రారంభమవుతుంది. నకిలీదైనట్లయితే అది సిరాను కరిగించకుండా రేఖను దాటి వ్యాప్తి చెందుతుంది. పేపర్ క్రోమాటోగ్రఫీ సూత్రం ప్రకారం బాల్ పాయింట్ పెన్నులో ఉండే సిరా నీటిలో కరగదు. అయితే త్వరగా ఆల్కహాల్లో కరిగి సిరా వ్యాప్తికి దారితీస్తుంది. ఈ లిక్విడ్ లో ఆల్కాహాల్ కంటెంట్ సిరాలో కరిగించదు.

గోధుమ పిండి పరీక్ష..
ఓ చిన్న గిన్నె తీసుకొని టేబుల్ స్పూన్ గోధుమ పిండి లేదా వేరే ఇతర పిండిలో శానిటైజర్ ను కలపండి. ఆ మిశ్రమాన్ని మెత్తగా కలిపేందుకు ప్రయత్నించండి. పిండి మెత్తగా అయితే ఆ శానిటైజర్ లో తగినంత ఆల్కహాల్ లేదని తెలుసుకోవాలి. ఒరిజినల్ హ్యాండ్ శానిటైజర్ ను పిండిని అంటుకునేలా చేయదు. పిండిలో కరిగిన వెంటనే అది ఎండిపోతుంది. శానిటైజర్లో కనీసం 60 శాతం ఆల్కహాల్  ఉందో లేదో తెలుసుకునేందుకు ఇది అత్యంత ప్రభావంతమైన పరీక్ష. ముఖ్యంగా పిండిగా మారడానికి తగినంత నీరు అవసరం. గ్లూటెన్, పిండిపదార్థాలు ఉబ్బి అంటుకునేలా చేస్తాయి.

హెయిర్ డ్రయర్ టెస్ట్..
రెండు చిన్న గిన్నెలు తీసుకోండి. ఓ గిన్నె తీసుకుని అందులో ఓ టేబుల్ స్పూన్ హ్యాండ్ శానిటైజర్ వేయండి. రెండవ దానిలో కొంచెం నీరు పోయండి. అనంతరం హెయిర్ డ్రయర్ ను వేడిచేయండి. అదే ఉష్ణోగ్రత వద్ద రెండు గిన్నెల్లో ద్రవాన్ని డ్రయర్ సాయంతో ఆరిపోయేటట్లు చేయండి. హ్యాండ్ శానిటైజర్ లో తగినంత ఆల్కాహాల్ ఉన్నట్లయితే అది నీటి కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ వద్ద ఉంటుంది కాబట్టి వేగంగా ఎండిపోతుంది.
Published by: Nikhil Kumar S
First published: October 28, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading