DO NOT NEGLECT FEVER COLD AND COUGH SAYS TELANGANA MINISTER ETELA RAJENDAR AK
కరోనా విషయంలో అప్పటివరకు ఆగొద్దన్న ఈటల
ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)
కరోనా విషయంలో చాలామంది ఊపిరి సమస్యలు తలెత్తేవరకు ఆగుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికే ముప్పు ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వారంతా వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలను సంప్రదించాలని ఆయన సూచించారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పీహెచ్సీలో టెస్టు తరువాత కరోనా అని నిర్ధారణ అయితే పేషెంట్‌కు ఏ రకమైన ట్రీట్’మెంట్ ఇవ్వాలనే అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారని ఈటల తెలిపారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ విషయంలో డాక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చాలామంది ఊపిరి సమస్యలు తలెత్తేవరకు ఆగుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికే ముప్పు ఎక్కువగా ఉంటుందని అన్నారు.
సాధారణంగా కరోనా ట్రీట్’మెంట్ అంతా కలిపితే రూ. 1000 దాటదని... ప్రజలెవరూ భయంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెట్టొద్దని అన్నారు. 10 రోజులు ఆక్సిజన్ పెట్టినా 2 వేలు మించదని అన్నారు. వెంటిలేటర్ వరకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు కీలక సూచనలు చేశామని.. వ్యాపార ధోరణితో ఆలోచించవద్దని ఆస్పత్రులకు తెలిపామని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు... అయితే వ్యాధి ముదిరిన తరువాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.