Home /News /coronavirus-latest-news /

DO CORONA VIRUS TEST FOR DEAD BODIES HIGH COURT ORDERED TELANGANA GOVERNMENT AK

మృతదేహాలకు కరోనా పరీక్షలు... తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

హైకోర్టు, కేసీఆర్

హైకోర్టు, కేసీఆర్

మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    తెలంగాణలో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే... కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. WHOతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని వాదించారు. దీంతో మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కొద్దివారాల క్రితం మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు