కరోనా వైరస్ నుంచి రక్షణ...పుతిన్‌కు ప్రత్యేక ఏర్పాటు

కరోనా వైరస్ నుంచి రక్షణ...పుతిన్‌కు ప్రత్యేక ఏర్పాటు

రష్యా అధ్యక్షుడు పుతిన్(ఫైల్ ఫోటో)

రష్యా అధ్యక్షుడు పుతిన్ కరోనా వైరస్ బారినపడకుండా ఆ దేశ అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆయన్ను కలిసేందుకు వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు...

 • Share this:
  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా... ఆయనకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. పుతిన్‌ను కలిసేందుకు ఎవరు వచ్చినా...ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్‌’ నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మాస్కో సమీపంలోని పుతిన్ అధికార నివాసంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్ కరోనా బారినపడకుండా ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. రష్యాల్లో కొన్ని మాసాల క్రితం కరోనా వైరస్ మహమ్మారి విజృంభన మొదలైనప్పటి నుంచి పుతిన్‌తో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. ఆయన అధికా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం పుతిన్‌ను కలిసేందుకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించి...ఆ తర్వాతే అనుమతిస్తున్నారు.  రష్యాలో ఏప్రిల్ 30 తర్వాత అతి తక్కువ సంఖ్యలో బుధవారంనాడు 7,843 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా...మొత్తం 5,53,301 కేసులతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 7,478 మంది కరోనా వైరస్ కాటుకు మృతి చెందారు.
  Published by:Janardhan V
  First published:

  అగ్ర కథనాలు