పేద సినీ కళాకారుల కోసం దర్శకుడు వివి వినాయక్ భారీ విరాళం..

కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఎక్కడిదక్కడ షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది పేద కళాకారులకు ఈ కారణంగా పని లేకుండా పోయింది. వీరిని ఆదుకునేందుకు వినాయక్ తన వంతుగా భారీ విరాళం అందజేసారు.

news18-telugu
Updated: March 26, 2020, 7:58 AM IST
పేద సినీ కళాకారుల కోసం దర్శకుడు వివి వినాయక్ భారీ విరాళం..
వివి వినాయక్ (Source: Twitter)
  • Share this:
కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఎక్కడిదక్కడ షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది పేద కళాకారులకు ఈ కారణంగా పని లేకుండా పోయింది. సినీ ఇండస్ట్రీలో చాలా మంది రెక్కాడితే కానీ డిక్కాడని వారు చాలా మంది ఉన్నారు. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో వారికి అండగా నిలబడాలనే ఆలోచనతో సినీ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. పేద కళాకారులు, టెక్నీషియన్స్‌ను ఆదుకోవడం కోసం వివి వినాయక్ తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న మనం సైతం ఫౌండేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను వినాయక్ అందజేసారు. ఈ సందర్భంగా వినాయక్ ఓ వీడియో రిలీజ్ చేసాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌ను మన భారతీయులందరం ఇంట్లో ఉండి అది వణికి పారిపోయేలా చేయాలని పిలుపునిచ్చారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కేంద్రం దేశాన్ని 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది.

director VV Vinayak donates 5 lakh rupees to poor film actors and technicians,vv vinayak,VV Vinayak donates 5 lakhs rupees to poor actors,VV Vinayak donates 5 lakh rupees,VV Vinayak help to por actors technician,VV Vinayak  chiranjeevi,VV Vinayak balakrishna,VV Vinayak jr ntr,VV Vinayak as hero,tollywood,telugu cinema,corona virus VV Vinayak,covid 19 VV Vinayak,వినాయక్,వివి వినాయక్,వివి వినాయక్ భారీ విరాళం,వివి వినాయక్ 5 లక్షల విరాళం,వివి వినాయక్ రూ 5 లక్షల విరాళం,పేద కళాకారుల కోసం వివి వినాయక్ విరాళం
రూ.5 లక్షల చెక్‌ను అందజేస్తోన్న వినాయక్ (Twitter/Photo)


దీంతో చిత్ర పరిశ్రమలోని కళాకారులు, టెక్నీషియన్స్, డాన్సర్లు, ఫైటర్లు, చాలా మంది నెల రోజుల పాటు షూటింగ్స్ లేకపోతేే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం మన కనీస ధర్మం. అందుకే తన వంతుగా ఈ సాయం అందజేసినట్టు ప్రకటించారు వినాయక్. నిజంగా ఎవరికి అవసరమో వాళ్లు కాదంబరి కిరణ్‌ను సంప్రదించి నిత్యావసరాల్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వివి వినాయక్..‘శీనయ్య’ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ‘లూసీఫర్’ రీమేక్‌ను తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు