కరోనాపై పోరులో నేను సైతం అంటూ విరాళం ప్రకటించిన సుకుమార్..

Sukumar | రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, దర్శకులు. తాజాగా దర్శకుడు సుకుమార్.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతుగా విరాళం ప్రకటించారు.

news18-telugu
Updated: March 27, 2020, 1:28 PM IST
కరోనాపై పోరులో నేను సైతం అంటూ విరాళం ప్రకటించిన సుకుమార్..
సుకుమార్: 10 లక్షలు (తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షలు)
  • Share this:
రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఈ వైరస్ కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమకు చేతనైన సాయం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోలు మాత్రమే కాదు.. అగ్ర దర్శకులు సైతం తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అనిల్ రావిపూడి, కొరటాల శివ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 లక్షల చెప్పున మొత్తంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. చెన్నై, హైదరాబాద్‌కు చెందిన సినీ మ్యూజిషియన్స్ యూనియన్‌కు రూ.5 లక్షల విరాళం ప్రకటించిన తన ఔదార్యాన్ని ప్రకటించుకున్నారు.

దర్శకుడు సుకుమార్ (Director Sukumar)
దర్శకుడు సుకుమార్ (Director Sukumar)


తాజాగా కరోనా వైరస్ నిర్మూలనకు  తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన అనౌన్స్ చేసారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 27, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading